Breaking News

ఢిల్లీలో తొలిసారిగా హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌ : ఎంతవరకు సేఫ్‌, ఎలా బుక్‌ చేసుకోవాలి?

Published on Wed, 11/26/2025 - 16:24

Delhi’s First Hot-Air Balloon Ride  న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో మొట్ట మొదటి హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌లు ప్రారంభం కానున్నాయి. దీనికి ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA ) మంగళవారం బాన్సేరాలో ట్రయల్ రన్‌ను కూడా ప్రారంభించింది. ఢిల్లీలో వినోద, సాహస కార్యక్రమాలను విస్తరించే చర్యల్లో భాగంగా  వీటిని అసిత రివర్ ఫ్రంట్, యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ,కామన్వెల్త్ గేమ్స్ (CWG) విలేజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లలో అదనపు లాంచ్ సైట్‌లను ప్లాన్ చేశారు. విజయవంతమైన ట్రయల్ రన్‌ల తర్వాత  నవంబర్ 29 నుండి హాట్‌ ఎయిర్‌ బెలూన్ రైడ్‌లను ఢిల్లీ వాసులు ఎంజాయ్‌ చేయవచ్చు.

యమునా  నది ఒడ్డున  ఆహ్లాదంగా 
యమునా నది ఒడ్డున ఉన్న ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA) బాన్సేరా పార్క్‌లో సర్టిఫైడ్ నిపుణుల పర్యవేక్షణ, కఠినమైన భద్రతా ప్రోటోకాల్‌లతో శనివారం నుండి ఈ రైడ్స​ అందుబాటులోకి రానున్నాయి. మెరుగైన ఎంటర్‌టైన్‌మెంట్‌,ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో తొట్టతొలిగా వీటిని ప్రారంభింస్తున్నామని,  ఢిల్లీని మరింత శక్తివంతమైన నగరంగా మార్చే దిశగా  ఇదొక అడుగు అధికారులు చెబుతున్నారు. ఈ బెలూన్ రైడ్‌లతో, ఢిల్లీ పర్యాటక  రంగం మరింత ఆకర్షణీయంగా మారుతుందని అంచనా.  ఈ నేపథ్యంలో  అసలు హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌ ఏంటి? ఎలా ఉంటాయి? ఎంతవరకు సురక్షితం లాంటి విషయాలను చూద్దాం.

అసలేంటీ హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ రైడ్‌ 
హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ నిర్వహణను చాలా సురక్షితంగా, పకడ్బందీగా చేయాల్సి ఉంటుంది. వేడి గాలిని బెలూన్ రైడ్‌లో ఉపయోగిస్తారు. హాట్ ఎయిర్ బెలూన్లలో 3 కీలక భాగాలు, ఒక బెలూన్ (ఎన్వలప్), ఒక బుట్ట , బర్నర్లతో కూడిన సాధారణ వాహనాలు. ఇవన్నీ చాలా బలమైన మెటల్ కేబుల్స్‌​ ద్వారా  కలుపుతారు. తద్వారా ఎక్కడా లూజ్‌గా లేకుండా దృఢంగా ఉండేలా చేసుకుంటారు.

ఎలా ఎగురుతుంది?
బెలూన్ కింద ఇంధనాన్ని మండించి, వేడి గాలితో నింపడం ద్వారా ఇవి పనిచేస్తాయి. ఆ వేడి గాలి లిఫ్ట్‌ను ఉత్పత్తి చేస్తుంది.వేడి గాలి ద్వారా లిఫ్ట్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా హాట్ ఎయిర్ బెలూన్‌లు ఎగురుతాయి. వీటికి వాడే ప్రాథమిక ఇంధనం ప్రొపేన్. ఇది ఒక రకమైన ద్రవీకృత పెట్రోలియం వాయువు (LPG). ప్రెషరైజ్డ్ ట్యాంకులలో నిల్వ  చేసి దీన్ని మండిస్తారు. అలా లోపల గాలి బయటి గాలి కంటే వేడిగా, తక్కువసాంద్రతతో ఉన్నప్పుడు, బెలూన్ పైకి లేచి పైకి లేస్తుంది. ఎత్తును నిర్వహించడానికి, పైలట్ క్రమానుగతంగా బర్నర్‌ను మండిస్తాడు.

 క్యూబిక్ అడుగుకు దాదాపు 7 గ్రాముల లిఫ్ట్‌ను ఉత్పత్తి చేస్తుంది. తగినంత సూపర్ హీట్ గాలితో, సాధారణంగా 77,000 నుండి 600,000  క్యూబిక్ అడుగుల వరకు, బెలూన్ టేకాఫ్ తీసుకోవచ్చు. బెలూన్లను వేర్వేరు ఎత్తులలో కనిపించే వివిధ వాయు ప్రవాహాలపై ఆధార పడి పైలట్లు నావిగేట్ చేస్తారు.పైలట్ బెలూన్‌లో నిరంతరం మారుతున్న ఉష్ణోగ్రతను ఉపయోగించి ఎత్తునుసర్దుబాటుచేసుకుంటూ దానిని నియంత్రిస్తారు. అలాగే "ఎన్వలప్ ఆఫ్ సేఫ్టీ" మార్గదర్శకాల ప్రకారం, పైలట్లను మాదకద్రవ్యాలు, మద్యం  సేవించారా అనేది  కచ్చితంగా చెక్‌ చేస్తారు.

ప్రొఫెషనల్ ఆపరేటర్లు, అత్యున్నత భద్రతా ప్రమాణాలు 
బెలూనింగ్ ,విమానయాన-సంబంధిత వినోద సేవలలో ముందస్తు అనుభవం ఉన్న సర్టిఫైడ్ ఆపరేటర్‌ను DDA నియమించింది. ఈ బృందం   అనేక టెస్టింగ్‌ కార్యక్రామలను కూడా నిర్వహించింది.  ప్రతీ  రైడ్‌కు ముందు  భద్రతా తనిఖీలుంటాయి. హాట్ ఎయిర్ బెలూన్‌లు టెథర్  చేస్తారు. అంటే అవి ఎక్కేటప్పుడు నేలకు లంగరు వేయడం తోపాటు, చుట్టు పక్కల అందమైన నగర దృశ్యాలు అన్నివైపుల నుంచి కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి అన్ని నియమాలు, కార్యాచరణ అంతా  భద్రతా నిబంధనలకు కట్టుబడి ఉంటుందని అధికారులు తెలిపారు.

ఎంత ఛార్జ్‌ చేస్తారు
ప్రతి బెలూన్ రైడ్ ధర 15-20 నిమిషాల  వ్యవధిలో  ఒక్కొక్కరికి రూ. 3,000 (పన్నులు మినహాయించి). వాతావరణ పరిస్థితులను బట్టి ఆపరేటర్ ప్రతిరోజూ రెండు స్లాట్‌లను నడుపుతారు,ఉదయం ఒకటి ,సాయంత్రం ఒకటి. ప్రతి ట్రిప్‌కు సామర్థ్యం బాస్కెట్‌కు దాదాపు నలుగురు వ్యక్తులకు పరిమితం.

ఎలా బుక్ చేసుకోవాలి:
ఢిల్లీలోని హాట్-ఎయిర్ బెలూన్ రైడ్‌ల కోసం బుకింగ్‌లను ప్రతి సైట్‌లో DDA నియమించిన ప్రైవేట్ ఆపరేటర్ నిర్వహిస్తారు. బాన్సేరా పార్క్‌లో  పనివేళలలో టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. థ్రిల్లోఫిలియా వంటి సైట్‌ల ద్వారా కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

ప్రమాదాల మాట ఏంటి? 
హాట్‌  ఎయిర్‌బెలూన్‌లో కూర్చొని మేఘాల్లో, ఆకాశ తీరంలో విహరిస్తూ.. సుందర దృశ్యాలను వీక్షించడం అద్భుతమైన జీవితకాల అనుభూతి. అయితే కొండకచో కొన్ని ప్రమాదాలు సంభవించిన దాఖలాలు కూడా లేకపోలేదు. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ అందించిన 2022 డేటా ప్రకారం, 1964లో అమెరికాలో మొత్తం 775 హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదాలు నమోదయ్యాయి. వాటిలో 70 మాత్రమే మరణాలు సంభవించాయి. 2000-2011 మధ్య కొన్ని ప్రమాదాలుచోటు చేసుకున్నాయి. కమర్షియల్‌ హాట్‌  ఎయిర్ బెలూన్ ఎగరడం చుట్టూ ఉన్న నిబంధనలు సడలించిన మూలంగానే  ఇవి జరిగినట్టు  2013 అధ్యయనంలో  తేలింది. 2016లో టెక్సాస్‌లోని లాక్‌హార్ట్‌లో జరిగిన ప్రమాదంలో వేడి గాలి బెలూన్ విద్యుత్ లైన్‌లను ఢీకొట్టి మంటల్లో చిక్కుకుని 16 మంది మరణించారు. ఈ సంఘటన తరువాత "ఎన్వలప్ ఆఫ్ సేఫ్టీ"  లాంటి కొన్ని సేఫ్టీ నిబంధనలను మరింత కఠినతరం చేశారు.

2025లో ప్రమాదాలు

  • జూన్‌లో బ్రెజిల్‌లోని ప్రియా గ్రాండేలో ఒక హాట్ ఎయిర్ బెలూన్ మంటల్లో చిక్కుకుని కూలిపోయింది.ఎనిమిది మంది మరణించారు, మరో 13 మంది గాయపడ్డారు.

  • ఇహ్లారా లోయ సమీపంలోని మధ్య టర్కీలో రెండు హాట్ ఎయిర్ బెలూన్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పైలట్ మరణించగా,  31 మంది పర్యాటకులు గాయపడ్డారు. గాలిలో అకస్మాత్తుగా మార్పు ప్రమాదానికి  కారణమని అంచనా.

  • మెక్సికోలోని జకాటెకాస్‌లో జరిగిన ఒక ఉత్సవంలో నేలపై  ఉండగానే  హాట్ ఎయిర్ బెలూన్ మంటల్లో చిక్కుకుంది. ఒక వ్యక్తి చనిపోయాడు. మంటల్లో  చిక్కుకున్న ఇద్దర్ని రక్షించి,  తీవ్రమైన గాయలతో అతను చనిపోయాడు.

 

మేఘాల మధ్య విహరించడం అనే ఆనందం అనుభవించిన వాళ్లకి మాత్రమే అర్థమయ్యే థ్రిల్‌. ఇటీవలి సంవత్సరాలలో హాట్ ఎయిర్ బెలూన్ విహారయాత్రలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.  ఇలాంటి సాహసాలు కొంత రిస్క్‌తో కూడుకున్నవే.  అయినా హాట్ ఎయిర్ బెలూన్ అనుభవాన్ని ప్లాన్ చేసేటప్పుడు  రైడర్లు కూడా సేఫ్టీ మెజర్స్‌ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో  చెక్‌ చేసుకోవాలి.  చిన్న పిల్లలను లేదా గర్భిణీ స్త్రీలను  ఇలాంటి ప్రయాణాలకు దూరంగా ఉంచటం ఉత్తమం.  భయాలు, బెంగలు లేకుండా హాట్‌ఎయిర్‌ బెలూన్‌ రైడ్‌ను ఆస్వాదించడమే. హ్యాడీ  రైడ్‌  అండ్‌ థ్రిల్‌.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)