Breaking News

Earthquake: ఢిల్లీలో భారీ భూప్రకంపనలు

Published on Tue, 01/23/2024 - 07:02

ఢిల్లీ: పొరుగు దేశం చైనాలో భారీ భూకంపంతో.. మన దేశ రాజధాని ప్రాంతం వణికిపోయింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో ప్రకంపనలు చోటు చేసుకోగా.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని అధికారులు చెబుతున్నారు. 

చైనా దక్షిణ ప్రాంతం  జిన్‌జియాంగ్‌లో రిక్టర్‌ స్కేల్‌పై 80 కిలోమీటర్ల లోతున  7.2 తీవ్రతతో భూమి కంపించింది. ఆ  ప్రభావం ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్‌(National Capital Region)లోనూ కనిపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ ఎక్స్‌ అకౌంట్‌ ద్వారా వెల్లడించింది.

ఇదిలా ఉంటే.. చైనా భారీ భూకంపంతో చిగురుటాకులా వణికిపోయింది. సహాయక బృందాలు రంగంలోకి దిగి చర్యలు చేపట్టాయి.  అక్కడ వాటిల్లిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. 

మరోవైపు.. దేశ రాజధాని ప్రాంతం తరచూ భూ ప్రకంపనలకు కేంద్రంగా ఉంటోంది. పొరుగు దేశాల్లో ఎక్కడ భూమి కంపించినా .. ఏ స్థాయిలో ప్రకంపనలు సంభవించినా.. ఆ ప్రభావం ఢిల్లీ రీజియన్‌లో కనిపిస్తోంది. జనవరి 11వ తేదీన ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో 6.1 తీవ్రతతో అఫ్గనిస్థాన్‌లో భూకంపం సంభవించగా.. పాకిస్థాన్‌తో పాటు ఢిల్లీ, పంజాబ్‌ తదితర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. అంతకు ముందు నేపాల్‌ భూకంప ప్రభావమూ కనిపించింది.

Videos

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

DSC స్కామ్ బట్టబయలు లోకేష్ కి ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)