Breaking News

ఢిల్లీలో ఆరుబయట ఆటలొద్దు

Published on Mon, 12/15/2025 - 05:27

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం నానాటికీ దిగజారుతోంది. దాంతో పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ఔట్‌ డోర్‌ క్రీడలన్నింటినీ తక్షణం రద్దు చేయాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వాన్ని, నగర డెవలప్మెంట్‌ అథారిటీ (డీడీఏ)ని కమిషన్‌ ఫర్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ (సీఏక్యూఎం) ఆదేశించింది. లేదంటే పిల్లలు తీవ్ర అనారోగ్య బారి వాడటం ఖాయమని హెచ్చరించింది. ఢిల్లీతో పాటు హరియాణా, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వాలకు కూడా ఈ మేరకు కమిషన్‌ లేఖలు రాసింది. ‘ఆరుబయట ఆడే క్రీడలన్నింటినీ రద్దు చేయాలంటూ నవంబర్‌ 19నే మేం లేఖలు రాశాం.

 కానీ కొన్ని స్కూళ్లు, విద్యా సంస్థలు ఇంకా వాటిని కొనసాగిస్తున్నాయి‘ అంటూ ఆక్షేపించింది. ‘రోడ్లపై విపరీతమైన దుమ్ము పేరుకొని ఉంది. ఒకవైపు తీవ్ర కాలుష్యంతో సతమతమవుతూ ఉంటే వాటి నిర్వహణ ఇంత అధ్వానంగానా? సగానికి సగం రోడ్లపై మున్సిపాలిటీ వ్యాన్లు సేకరించిన చెత్త పడి ఉంది’ అంటూ నాలుగు పెట్టింది. శనివారం నుంచి ఢిల్లీ, ఎన్‌ సీఆర్‌ పరిధిలో అన్ని నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను సీఏక్యూఎం నిషేధించడం తెలిసిందే. అలాగే ట్రక్కులకు నగరంలోకి ప్రవేశాలు నిలిపేశారు. ఢిల్లీలో డీజిల్‌ వాహనాల రాకపోకలను నిషేధించారు. చలికాలంలో ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోతూ ఉంటుంది.

కర్టెన్లు చాలు: రామ్‌ దేవ్‌
ఢిల్లీ కాలుష్యానికి ఎయిర్‌ ప్యూరిఫయర్ల వాడకం పరిష్కారం కాదని యోగ గురు బాబా రామ్‌ దేవ్‌ అన్నారు. పైగా అది సంపన్నుల ఆడంబరం అంటూ ఎద్దేవా చేశారు. ‘ఢిల్లీ కొన్నిసార్లు గ్యాస్‌ చాంబర్‌ను తలపిస్తుంది. అంతమాత్రాన ఆందోళన పడాల్సిన పనిలేదు. డోర్‌ కర్టెన్లు వేసుకుంటే చాలు. వాటిని 20 రోజులకు ఒకసారి మూతికి మాస్క్‌ పెట్టుకొని దులుపుకుంటే సరిపోతుంది. దీనితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం కూడా అలవాటు చేసుకోవాలి’ అని ఒక టీవీ చానల్‌ చర్చా కార్యక్రమంలో సూచించారు. ఇంత కాలుష్యంలో వ్యాయామమా అని ప్రశ్నించగా, కపాలభాతి వంటి శ్వాస వ్యాయామాలు చేయాలన్నారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)