Breaking News

ఢిల్లీ బీజేపీ తొలి జాబితా విడుదల

Published on Sat, 01/04/2025 - 13:15

న్యూఢిల్లీ:  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 29 మంది పేర్లను ప్రకటించింది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్‌ కన్వీనర్‌, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై బీజేపీ తరఫున పర్వేష్‌ వర్మ పోటీ చేయబోతున్నారు. అలాగే కల్‌కాజీ నుంచి సీఎం అతిషిపై పోటీకి రమేష్‌ బిదురిని బీజేపీ రంగంలోకి దింపింది. 

ఢిల్లీ బీజేపీ(BJP) చీఫ్‌ వీరేంద్ర సచ్‌దేవ్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేయబోరంటూ తొలి నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి . ఈలోపు.. తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడం గమనార్హం. తొలి జాబితాలో ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. రేఖా గుప్తా, సుశ్రీ కుమారి రింకూలకు కమలం పార్టీ తొలి జాబితాతో అవకాశం కల్పించింది. 

ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌(Kailash Gehlot) కిందటి ఏడాది నవంబర్‌లో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. గత రెండు ఎన్నికల్లో నజఫ్‌గఢ్‌ నియోజక వర్గం నుంచి పోటీ చేసి నెగ్గిన కైలాష్‌.. ఈసారి బీజేపీ తరఫున బిజ్వాసన్ నుంచి పోటీ చేయబోతున్నారు. అలాగే పదేళ్లపాటు షీలా దీక్షిత్‌ కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన అరవిందర్‌ సింగ్‌ లవ్లీ.. కిందటి ఏడాది బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఈ ఎలక్షన్స్‌లో ఈస్ట్‌ ఢిల్లీ గాంధీనగర్‌ నుంచి పోటీ చేయబోతున్నారు.

ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly)లో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమ్‌ ఆద్మీ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఏడవది. దీని గడువు ఫిబ్రవరి 15వ తేదీతో ముగియనుండగా.. ఆలోపు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.

ఢిల్లీకి స్టేట్‌ స్టేటస్‌ వచ్చాక 1993లో జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. అయితే ఐదేళ్ల పాలనలో ముగ్గురు సీఎంలను మార్చింది. ఆపై జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ  నెగ్గింది. షీలా దీక్షిత్‌ సారథ్యంలో హస్తం పార్టీ హ్యాట్రిక్‌ పాలన సాగించింది. ఇక.. 2013 నుంచి ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. దీంతో.. 

ఈసారి ఎలాగైనా హస్తినను చేజిక్కించుకోవాలని బీజేపీ(BJP) భావిస్తోంది.  మరోసారి అధికారం దక్కించుకోవాలని ఆప్‌ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈసారి అధికారంపై కన్నేసింది. హర్యానా ఎన్నికల తర్వాత ఇండియా కూటమి మిత్రపక్షాలైన ఆప్‌-కాంగ్రెస్‌లు మరోసారి ఢిల్లీ ఎన్నికల ముక్కోణ్ణపు పోటీలో తలపడనున్నాయి.

Videos

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)