Breaking News

దేశంలో తొలి డ్యూయల్‌ చాంబర్‌ పేస్‌మేకర్‌ ఇంప్లాంట్‌

Published on Wed, 10/08/2025 - 05:52

న్యూఢిల్లీ: గుండె పనితీరును క్రమబద్ధం చేసేందుకు అమర్చే పేస్‌మేకర్‌ సర్జరీల్లో ఢిల్లీలోని మ్యాక్స్‌ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌ సరికొత్త చరిత్ర లిఖించింది. దేశంలో తొలిసారి ఓ రోగికి ‘డ్యూయల్‌ చాంబర్‌ పేస్‌మేకర్‌’(డీసీఎల్‌పీ)ను విజయవంతంగా అమర్చినట్లు మంగళవారం ప్రకటించింది. సాధారణ పేస్‌మేకర్లు అమర్చేందుకు రోగికి ఛాతీ భాగంలో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. పైగా దానికి వైర్లతో బయటి యంత్రానికి అనుసంధానం చేసి గుండె స్పందనలను క్రమబద్ధం చేయాల్సి ఉంటుంది. డ్యూయల్‌ చాంబర్‌ లీడ్‌లెస్‌ పేస్‌మేకర్లతో ఆ అవసరం ఉండదు.

ఇవి చిన్న క్యాప్సూల్‌ మాదిరిగా ఉంటాయి. వాటిని గుండె పై కర్ణికలో ఒకటి, కింది దమనికలో ఒకదానిని అమరుస్తారు. ఇందుకోసం పొట్టలోకి కృత్రిమంగా ఆహారాన్ని పంపే ఓ గొట్టంలాంటి పరికరాన్ని ఉపయోగిస్తారు. దీనివల్ల శస్త్రచికిత్సతో పని ఉండదు. ఈ క్యాప్సూల్స్‌కు వైర్లు ఉండవు. గుండె కొట్టుకునే వేగాన్ని బట్టి ఈ పరికరాలు రెండు వాటంతట అవే సమాచార మారి్పడి చేసుకుంటాయి. గుండె సాధారణంకంటే వేగంగా కొట్టుకోవటం ప్రారంభించగానే ఇవి పనిచేయటం మొదలుపెట్టి సాధారణ స్థితికి తీసుకొస్తాయి. అలాగే గుండె వేగం సాధారణంకంటే తగ్గితే వెంటనే కృత్రిమంగా వేగాన్ని పెంచుతాయి.  

83 ఏళ్ల వ్యక్తికి...
మ్యాక్స్‌ హాస్పిటల్‌లో 83 ఏళ్ల ఓ రోగికి వీటిని అమర్చారు. ఆస్పత్రి కార్డియాలజీ విభాగం చైర్మన్‌ డాక్టర్‌ బల్బీర్‌సింగ్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ అరుదైన చికిత్స నిర్వహించింది. ఆ రోగికి గుండెలో కర్ణిక, దమనికల మధ్య సమన్వయం లోపించటంతో గుండె వేగం సాధారణంకంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వయసు కారణాల రీత్యా సాధారణ పేస్‌మేకర్‌ చికిత్స సరికాదని గుర్తించి డ్యూయల్‌ చాంబర్‌ పేస్‌మేకర్‌ అమర్చినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆ రోగి ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి సమస్య రాలేదని వెల్లడించాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)