Breaking News

పూజా ఖేద్కర్‌కు మరో ఎదురు దెబ్బ

Published on Thu, 08/01/2024 - 17:16

ఢిల్లీ : సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో గట్టెక్కేందుకు నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో మాజీ ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేద్కర్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది.  ఆమె ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌ను గురువారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. 

నకిలీ పత్రాల కేసులో ఖేద్కర్‌ తరుఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది.  విచారణ సందర్భంగా.. తనని (ఖేద్కర్) ఓ అధికారి  లైంగికంగా వేధించారని, ఆయనపై ఫిర్యాదు చేసినందుకు తనని టార్గెట్‌ చేసినట్లు పేర్కొన్నారు.  తానెలాంటి తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు ముందస్తు బెయిల్‌ను కోరుతున్నారని పేర్కొన్నారు.  అనంతరం ఖేద్కర్‌ వ్యవస్థను మోసం చేశారని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అనంతరం ఆమె ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. 

మహారాష్ట్రకు చెందిన ప్రొబేషనరీ  ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేద్కర్‌ ఎంపికను యూపీఎస్సీ రద్దు చేసింది. భవిష్యత్తులో సివిల్స్ పరీక్షల్లో పాల్గొనకుండా ఆమెపై జీవితకాల నిషేధం విధించింది. పరీక్ష నిబంధనల్ని అతిక్రమిస్తూ నకిలీ ధ్రువపత్రాలతో పరీక్షను రాసినట్టు గుర్తించిన యూపీఎస్సీ ఈ మేరకు ఆమెపై చర్యలు చేపట్టింది. ఈ తరుణంలో ఆమె ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయడం గమనార్హం.

 

పలు సెక్షన్ల కింద కేసులు నమోదు 
ఖేద్కర్‌పై ఢిల్లీ పోలీసులకు యూపీఎస్సీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఐటీ యాక్ట్‌, డిసెబిలిటీ యాక్ట్‌ కింద ఫోర్జరీ,చీటింగ్‌ కేసుల్ని నమోదు చేశారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోసం ఖేద్కర్‌ ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆమె బెయిల్‌ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అతుల్‌ శ్రీవాత్సవ  ఈ కేసులో దర్యాప్తు "చాలా ప్రారంభ దశలో ఉంది" అని వాదించారు. కేసు తదుపరి విచారణ కోసం ఆమెను కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమని వాదించారు.

పూజా ఖేద్కర్‌ లాంటి వారి పట్ల కఠినంగా వ్యహరించాలి
" వాదన సమయంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఖేద్కర్‌ గురించి ప్రస్తావిస్తూ.. వ్యవస్థల్ని మోసం చేసే ఇలాంటి వ్యక్తుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలి. ఇప్పటికే చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారు. ఇంకా దుర్వినియోగం చేసే అవకాశాలు ఇంకా ఉన్నాయి " అని అన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)