Breaking News

విదేశీయుని వద్ద రూ.5000 చలానా వసూలు చేసిన పోలీసు.. రిసిప్ట్ ఇవ్వకుండానే..

Published on Sun, 07/23/2023 - 21:07

ఢిల్లీ: ఢిల్లీలో అక్రమంగా ట్రాఫిక్ చలానా వసూలు చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కొరియా దేశస్థుని వద్ద కానిస్టేబుల్‌ రిసిప్ట్ ఇవ్వకుండానే రూ. 5000 చలానా వసూలు చేశాడు. నెలక్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.   

వీడియో ప్రకారం.. కానిస్టేబుల్ మహేష్ చంద్.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కొరియా దేశస్థునికి రూ.5000 జరిమానా విధించినట్లు చెప్పారు. కానీ విదేశీయుడు రూ.500 ఇచ్చాడు. తను అడిగిన డబ్బు రూ. 500 కాదని, రూ. 5000 అని చెప్పి కానిస్టేబుల్ మళ్లి అడిగాడు. చేసేది లేక విదేశీయుడు కానిస్టేబుల్‌కు మిగిలిన డబ్బును ఇచ్చేశాడు. ఆ తర్వాత ఇద్దరు హ్యాండ్స్ షేక్ చేసుకుని వెళ్లిపోతారు. కానీ  జరిమానాకు సంబంధించిన పత్రాన్ని ఆ బాధిత విదేశీయునికి కానిస్టేబుల్ ఇవ్వలేదు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కాగా.. పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సదరు పోలీసు కానిస్టేబుల్‌ను విధుల నుంచి తప్పించారు. సంబంధిత వీడియోపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. జరిమానాకు సంబంధించిన పత్రాన్ని ఇచ్చేలోపే ఆ విదేశీయుడు వెళ్లిపోయినట్లు కానిస్టేబుల్ చెబుతున్నాడు.     

ఇదీ చదవండి: సినిమా రేంజ్‌లో.. దంపతుల పక్కా స్కెచ్‌.. టమాటా లారీ హైజాక్..


 

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి