Breaking News

ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం.. అతిషి Vs ఎల్జీ సక్సేనా

Published on Wed, 01/01/2025 - 09:36

సాక్షి, ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఢిల్లీ లెఫ్లినెంట్‌ గవర్నర్‌పై ముఖ్యమంత్రి అతిషి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో, ఆమెకు వ్యాఖ్యలపై రాజ్‌భవన్‌ వర్గాలు స్పందిస్తూ ఆప్‌ సర్కార్‌పై ఆగ్రహం వ్య​క్తం చేసింది.

ముఖ్యమంత్రి అతిషి తాజా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఢిల్లీలో మతపరమైన కట్టడాలను కూల్చివేయడానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఆదేశాలు ఇచ్చారని అన్నారు. సక్సేనా ఆదేశాల మేరకు ప్యానెల్‌ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆదేశాలపై తమకు సమాచారం ఉందని కామెంట్స్‌ చేశారు.

ఈ నేపథ్యంలో అతిషి కామెంట్స్‌పై గవర్నర్‌ కార్యాలయం స్పందించింది. ఆప్‌ సర్కార్‌ చౌకబారు రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో మతపరమైన స్థలాలను కూల్చివేసేందుకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఒకవేళ.. రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వక విధ్వంసానికి పాల్పడే శక్తులు ఇలాంటి దారుణాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఢిల్లీలో మరింత నిఘా పెంచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

 ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆప్‌ నేతలు ప్లాన్‌ చేస్తున్నాయి. ఇక, ఇటీవల పార్లమెంట్‌ ఎన్నికల్లో సాధించిన విజయంతో అసెంబ్లీలో ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని బీజేపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అటు, కాంగ్రెస్‌ కూడా ఢిల్లీ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది.

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)