Breaking News

చాందినీ చౌక్‌ చరిత్ర ఏమిటి? ఈ మార్కెట్‌ ఎలా ఏర్పాటయ్యింది?

Published on Mon, 09/04/2023 - 13:44

ఎవరిమధ్యనైనా ఢిల్లీకి సంబంధించిన ప్రస్తావన వచ్చిప్పుడు చాందినీ చౌక్‌ను తప్పక తలచుకుంటారు. చాందినీ చౌక్‌ పలు సినిమాల్లో కూడా కనిపించింది. చాందినీ చౌక్ పేరుతో ఒక చిత్రం కూడా విడుదలయ్యింది. చాందినీ చౌక్ ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ అనేక రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయి. సరసమైన ధరలకు దుస్తులు, ఆభరణాలు.. ఇలా ఒకటేమిటి ఏ వస్తువైనా ఇక్కడ చిటికెలో దొరుకుతుంది. షాపింగ్‌తో పాటు రుచికరమైన తినుబండారాలు కూడా ఇక్కడ లభ్యమవుతాయి. 

చాందినీ చౌక్  ఎంతో పురాతనమైన మార్కెట్. దీనికి 370 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ మార్కెట్‌లోని ఇరుకైన వీధులను కత్రా అని పిలుస్తారు. మార్కెట్‌ నిత్యం  కొనుగోలుదారులతో రద్దీగా ఉంటుంది. పాత ఢిల్లీలో ఉన్న ఈ  చాందినీ చౌక్ మార్కెట్ ఢిల్లీకి గర్వకారణంగా నిలుస్తుంది. ఇక్కడ అన్ని వయసుల వారికి వారు కోరుకున్న వస్తువులు లభ్యమవుతాయి. 
 
షాజహాన్ తన కూతురి కోసం..
పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని షాజహానాబాద్ అని పిలిచేవారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమార్తెకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఆమె అభిరుచిని నెరవేర్చేందుకు చక్రవర్తి తన ఎర్రకోట ముందు మార్కెట్‌ను ఏర్పాటు చేశాడు. దీంతో షాజహాన్‌ కుమార్తె ఇక్కడ షాపింగ్ చేసేది. 1650లో షాజహాన్ ఈ మార్కెట్‌ను నిర్మించాడు. క్రమంగా ఈ మార్కెట్ చాలా ప్రసిద్ధి చెందింది. ఢిల్లీలోని ప్రత్యేక మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. 
 
మత సామరస్యానికి ఉదాహరణ
చాందినీ చౌక్‌ను షాజహాన్ స్థాపించినప్పటికీ, ఇక్కడ అందరికీ షాపింగ్ చేసే అవకాశం ఉంది. చాందినీ చౌక్ ఏరియా అన్ని మతాలకు చెందిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రముఖ గౌరీ శంకర్ ఆలయం, ఫతేపురి మసీదు ఉన్నాయి. అంతే కాదు ప్రసిద్ధ సిక్కు గురుద్వారా శిష్‌గంజ్ కూడా చాందినీ చౌక్‌లో ఉంది. సెంట్రల్ బాప్టిస్ట్ చర్చి కూడా ఇక్కడ ఉంది. చాందినీ చౌక్  మార్కెట్‌ వెండి, బంగారు ఆభరణాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వివాహ షాపింగ్ చాలా చౌకగా చేయవచ్చని పలువురు చెబుతుంటారు.
ఇది కూడా చదవండి:  ప్రపంచాన్ని వణికించిన 8 ఉగ్రదాడులు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)