Breaking News

కన్నప్రేమను పంచిన ‘ఆంటీ’.. కానరాని లోకాలకు!

Published on Mon, 06/01/2026 - 13:22

న్యూఢిల్లీ: ఢిల్లీలోని సాకేత్‌ మెట్రో స్టేషన్ సమీపంలో భవనం కూలిన ‍ఘటన ఒక కుటుంబంలోనే కాకుండా, అక్కడి విద్యార్థులకూ  తీరని విషాదాన్ని పంచింది. ఈ ఘటన అనంతరం శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులను కాపాడాలనే ప్రయత్నంలో ప్రమాద స్థలంలోకి వెళ్లిన పార్వతీ ఓజా (50) ప్రాణాలు కోల్పోయారు.

విద్యార్థులకు ‘పార్వతీ ఆంటీ’
ఢిల్లీలోని సైదులాబాద్ ప్రాంతంలో ‘ఆంటీ వాలా కిచెన్’ నడుపుతున్న పార్వతి అక్కడి విద్యార్థులకు కేవలం ఆహారాన్ని అందించడమే కాకుండా, ఒక తల్లి చూపించే ఆప్యాయతను కూడా పంచేవారు. హోమ్లీ ఫుడ్‌తో పాటు ఆమె చూపే ప్రేమ కారణంగా పలువురు విద్యార్థులు ఆమెను ‘పార్వతీ ఆంటీ’ అని పిలుచుకునేవారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో కూడా ధరలు పెంచకుండా, విద్యార్థులకు ఆమె చక్కని ఆహారం అందించారని స్థానికులు చెబుతుంటారు.

ప్రాణాలకు తెగించి..
ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన సమయంలో  పార్వతి ప్రమాదం నుంచి బయటపడ్డారు. కానీ లోపల విద్యార్థులు చిక్కుకున్నారని తెలియగానే, వారిని రక్షించేందుకు ఆమె లోనికి వెళ్ళారు. అదే సమయంలో భవనం పూర్తిగా కుప్పకూలడంతో ఆమె శిథిలాల కింద చిక్కుకుపోయారు. 16 గంటల సుదీర్ఘ సహాయక చర్యల తర్వాత ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనలో ఆమెతో పాటు మరో ఐదుగురు విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఈ దుర్ఘటన ఢిల్లీలో అక్రమ కట్టడాల వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. తనిఖీలు లేని భవనాలు ఎలా మరణశాసనంగా మారుతున్నాయనే దానికి ఈ ఘటన  ఉదాహరణగా నిలిచింది. 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)