Breaking News

Delhi Budget: రూ. ఒక లక్ష కోట్లు.. బీజేపీ వరాల జల్లు

Published on Tue, 03/25/2025 - 12:31

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా(Delhi Chief Minister Rekha Gupta) మంగళవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఢిల్లీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖను కూడా సీఎం రేఖ గుప్తానే పర్యవేక్షిస్తున్నారు. సీఎం రేఖా గుప్తా 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. ఒక లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌ను సమర్పించారు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్(Budget) కంటే ఈ బడ్జెట్ 31.5 శాతం  అధికం. ఈ బడ్జెట్‌లో ఢిల్లీ ప్రజలకు బీజేపీ ప్రభుత్వం ఏఏ వరాలను అందించిందంటే..

ఆరోగ్య బీమా
ఢిల్లీ ప్రజలకు ఇకపై రూ.10 లక్షల ఆరోగ్య బీమా  అందుతుందని ముఖ్యమంత్రి రేఖ గుప్తా  ప్రకటించారు. ‘మహిళా సమృద్ధి యోజన’ కోసం బడ్జెట్‌లో రూ.5,100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకం పరిధిలోకి వచ్చే ఢిల్లీలోని ప్రతి మహిళకు ప్రతీనెల రూ. 2,500 ఆర్థిక సహాయం అందుతుందన్నారు.

ఢిల్లీ బడ్జెట్‌లోని కీలక ప్రకటనలు

  • మూలధన వ్యయం దాదాపు రెట్టింపు చేశారు. గత బడ్జెట్‌లో మూలధన వ్యయం రూ. 15 వేల కోట్లుగా ఉండగా, ఈ బడ్జెట్‌లో దానిని రూ. 28 వేల కోట్లకు పెంచారు.

  • త్వరలో ఢిల్లీలో ఆయుష్మాన్ యోజన అమలు.

  • ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ జన ఆరోగ్య యోజనకు అదనంగా మరో రూ. ఐదు లక్షలు జత చేస్తుంది. అంటే రూ. 10 లక్షల కవర్  అందుతుంది. ఈ పథకానికి ₹2144 కోట్లు కేటాయించారు.

  • మహిళా సమృద్ధి యోజనకు రూ.5,100 కోట్లు కేటాయింపు.

  • ప్రసూతి వందన పథకానికి రూ.210 కోట్లు. 

  • నీరు, విద్యుత్, రోడ్లు అభివృద్ధికి ప్రణాళికలు.

  • ఢిల్లీ రోడ్డు రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధి. ఎన్‌సీఆర్‌తో అనుసంధానం కోసం రూ.1,000 కోట్లు ఖర్చు.

  • మహిళల భద్రత కోసం అదనంగా 50 వేల సీసీటీవీల ఏర్పాటు.

  • జేజే కాలనీ అభివృద్ధికి రూ.696 కోట్లు కేటాయింపు.

  • ప్రధానమంత్రి గృహనిర్మాణ పథకానికి రూ.20 కోట్లు కేటాయింపు.

  • 100 చోట్ల అటల్ క్యాంటీన్లు ఏర్పాటు. ఇందుకోసం రూ. 100 కోట్ల బడ్జెట్ కేటాయింపు.

  • ఢిల్లీ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానంతో పాటు గిడ్డంగి విధానాన్ని అమలులోకి తీసుకురానుంది.
    సింగిల్ విండో వ్యవస్థ అమలు.

  • పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి.

  • వ్యాపారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు.

  • ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్  నిర్వహణ.

ఇది కూడా చదవండి: Bihar: ఆగని పోస్టర్‌ వార్‌.. సీఎం నితీష్‌ టార్గెట్‌
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)