Breaking News

Delhi Baba: ఫోన్‌ నిండా ‘ఫొటోలు.. చాట్‌లు’

Published on Tue, 09/30/2025 - 10:59

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ఆశ్రమంలో పలువురు మహిళలను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్యానంద సరస్వతిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ దర్యాప్తులో పలు విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. చైతన్యానంద సరస్వతి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని పరిశీలించగా, మహిళల చిత్రాలు, వారితో చేసిన చాట్‌లు కనిపించాయి. ఈ చాట్‌లలో  చైతన్యానంద సరస్వతి వివిధ హామీలతో పలువురు మహిళలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

చైతన్యానంద అలియాస్ పార్థ సారథి.. ఆశ్రమంలో పనిచేస్తున్న పలువురు మహిళా సిబ్బంది  ఫోటోలను తన ఫోన్‌లో సేవ్ చేసుకున్నాడని పోలీసులు కనుగొన్నారు. ఈ చిత్రాలను అతను వారి సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాల నుంచి స్క్రీన్‌షాట్‌లను తీసుకుని సేవ్ చేసుకున్నాడని గుర్తించారు. వసంత్ కుంజ్‌లోని శ్రీ శారద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ అనే ప్రైవేట్ సంస్థ మాజీ డైరెక్టర్ అయిన చైతన్యానంద సరస్వతి పలువురు మహిళలకు అసభ్యకర సందేశాలు పంపడం, బలవంతంగా వారితో శారీరక సంబంధం పెట్టుకోవడం లాంటి ఫిర్యాదులు ఎదుర్కొంటున్నాడు. మహిళా హాస్టల్‌లో అతను రహస్య కెమెరాలు ఏర్పాటు చేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

50 రోజుల పాటు పరారీలో ఉన్న చైతన్యానంద సరస్వతిని రెండు రోజుల క్రితం ఆగ్రాలోని ఒక హోటల్‌లో పోలీసులు పట్టుకున్నారు. కాగా దర్యాప్తుకు చైతన్యానంద  సహకరించడం లేదని, విచారణ సమయంలో అబద్ధాలు చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. ఐక్యరాజ్యసమితి, బ్రిక్స్ రాయబారిగా చైతన్యానంద సరస్వతిని పేర్కొంటూ రూపొందించిన రెండు నకిలీ విజిటింగ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కేటగిరీలో స్కాలర్‌షిప్ పొందుతున్న 17 మంది విద్యార్థినులు చైతన్యానంద సరస్వతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)