Breaking News

ఢిల్లీలో ‘24 గంటల స్వచ్ఛమైన నీరు’ అందిస్తాం

Published on Wed, 12/25/2024 - 05:07

సాక్షి, న్యూఢిల్లీ:  ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ ప్రజల కోసం పెద్ద ఎన్నికల హామీలు చేస్తూనే ఉన్నారు. ఢిల్లీలో 24 గంటలు స్వచ్ఛమైన నీటిని అందిస్తామని కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు. కాగా ఇంతకుముందు, కేజ్రీవాల్‌ మహిళా యోజన, సంజీవని యోజన, ఆటో డ్రైవర్లకు హామీ మరియు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తామని వాగ్దానం చేశారు. రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఓ కాలనీలో మంగళవారం నుంచి 24 గంటల స్వచ్ఛమైన నీటి సరఫరా ప్రారంభిస్తున్నట్లు ఆప్‌ అధినేత తెలిపారు. 

త్వరలో మొత్తం ఢిల్లీలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నామ ని వాగ్దానం చేశారు. మంగళవారం బూస్టర్‌ పంపింగ్‌ స్టేషన్‌ ప్రారం¿ోత్సవం తర్వాత, అరవింద్‌ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి రాజేంద్ర నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పాండవ్‌ నగర్‌ డీడీఏ ఫ్లాట్‌లకు వెళ్లి... అక్కడ నేరుగా కుళాయిలో నీరు తాగి నీటి నాణ్యతను తనిఖీ చేశారు.  కాగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీలో మహిళా సమ్మాన్‌ యోజ న, సంజీవని యోజన కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. 

ముఖ్యమంత్రి ఆతిషి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం తూర్పు కిద్వాయ్‌ నగర్‌ నుంచి మహిళా సమ్మాన్‌ యోజన కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. ఈ పథకం కింద మహిళలకు నెలకు రూ.2,100 అందించనున్నారు. అదేవిధంగా, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత చికిత్స కోసం సంజీవని యోజన కోసం రిజి్రస్టేషన్లు కూడా జంగ్‌పురా నుంచి ప్రారంభించారు. వీటితో పాటు దళితుల కోసం డాక్టర్‌ అంబేడ్కర్‌ సమ్మాన్‌ స్కాలర్‌షిప్‌ పథకాన్ని ప్రకటించారు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)