Breaking News

ఢిల్లీలో మళ్లీ క్షీణించిన వాయు నాణ్యత 

Published on Fri, 11/07/2025 - 06:24

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత మళ్లీ పడిపోయింది. గురువారం నగరం మొ త్తం గాలి నాణ్యత పేలవంగా మారింది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(పీసీబీ) ప్రకారం ఏక్యూఐ 264కి పెరిగింది. రాబోయే రోజుల్లో మరింత క్షీణిస్తుందని పీసీబీ హెచ్చరించింది. రాజధానిలోని అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ఐటీవో చుట్టూ దట్టమైన పొగమంచు ఆవరించింది. ఇక్కడ గురువారం ఉదయం ఏక్యూఐ 290ని తాకింది. ఉత్తర ఢిల్లీలోని నరేలాలోనూ గాలి నాణ్యత దారుణంగా ఉంది. ఏక్యూఐ ఇక్క డ 294గా నమోదైంది. 

ఢిల్లీలో దాదాపు వారం తర్వాత బుధవారం అత్యంత స్వచ్ఛమైన గాలి నమోదైంది. గురువారానికి తిరోగమించింది. బుధవారం తగ్గిన కీలకమైన కాలుష్య కారకాల స్థాయిలు గురువారం ఉదయం నాటికి, నగరంలోని 38 పర్యవేక్షణ కేంద్రాలలో చాలా వరకు ఆందోళనకరమైన స్థాయికి తిరిగొచ్చాయి. ఒక్క ఢిల్లీనే కాదు, రాజధానికి ఆనుకుని ఉన్న నగరాల్లోనూ గాలి నాణ్యత క్షీణించింది. ఏక్యూఐ గురుగ్రామ్‌లో 229, నోయిడాలో 216, ఘజియాబాద్‌లో 274గా నమోదైంది. çఫరీదాబాద్‌లో ఏక్యూఐ 187 నమోదైంది. ఢిల్లీ కంటే కొంచెం మెరుగ్గా ఉంది.  

గాలి వేగం తగ్గటం వల్లే... 
గాలి వేగం గంటకు 10 కిలోమీటర్ల కంటే తక్కు వగా పడిపోవడం వల్లే కాలుష్య కారకాలు పేరు కుపోతున్నాయని ఎయిర్‌ క్వాలిటీ హెచ్చరిక వ్యవస్థ తెలిపింది. మరో రెండు రోజుల పాటు గాలి నాణ్యత పేలవంగానే ఉంటుందంది. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)