Breaking News

Delhi Air Pollution: కాలుష్యం కోరల్లో ఢిల్లీ

Published on Sat, 11/04/2023 - 05:05

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. శుక్రవారం ఉదయం ‘తీవ్రమైన ప్లస్‌’ కేటగిరీకి చేరిందని అధికారులు వర్గాలు వెల్లడించాయి. మితిమీరిన కాలుష్యంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నగరాన్ని పొగ మంచు కమ్మేసింది. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గురువారం ఉదయం ఢిల్లీలో 346గా ఉన్న వాయు నాణ్యత సూచి(ఏక్యూఐ) సాయంత్రం కల్లా 418కు చేరిందని కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది.

శుక్రవారం ఉదయం ఏకంగా 450గా నమోదైందని తెలియజేసింది. లోధీ రోడ్, జహంగీర్‌పురి, ఆర్కే పురం, ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో వాయు నాణ్యత సూచి 438, 491, 486, 473గా ఉన్నట్లు పేర్కొంది. నగరాన్ని పొగ మంచు కమ్మేసిన డ్రోన్‌ దృశ్యాలను వార్తా సంస్థ ఏఎన్‌ఐ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. కాలుష్య తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఢిల్లీలో పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. నిర్మాణ పనులపై ఆంక్షలు విధించారు. లైట్‌ కమర్షియల్‌ వాహనాలు, డీజిల్‌ ట్రక్కుల రాకపోకలను నిషేధించారు.  భవన నిర్మాణ పనులను, కూల్చివేతలను నిషేధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ ప్రకటించారు.   

పొరుగు రాష్ట్రాల్లోనూ కాలుష్య భూతం  
కాలుష్యం కేవలం ఢిల్లీకే పరిమితం కావడం లేదు. రాజస్తాన్‌లోని హనుమాన్‌గఢ్, భివాడీ, శ్రీగంగానగర్, హరియాణాలోని హిసార్, ఫతేబాద్, జింద్, రోహ్‌తక్, బహదూర్‌గఢ్, సోనేపట్, కురుక్షేత్ర, కర్నాల్, ఖైతాల్, ఫరీదాబాద్, గురుగ్రామ్, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, బాఘ్‌పట్, మీరట్, నోయిడా, గ్రేటర్‌ నోయిడా తదితర ప్రాంతాల్లోనూ వాయు నాణ్యత దిగజారింది.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)