Breaking News

దీపావళికి ముందే గ్యాస్‌ ఛాంబర్‌లా రాజధాని

Published on Sat, 10/26/2024 - 07:23

న్యూఢిల్లీ: దీపావళికి ముందే దేశరాజధాని ఢిల్లీ గ్యాస్‌ ఛాంబర్‌లా మారింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా స్థానికులు పలు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు.

విపరీతమైన వాయు కాలుష్యం కారణంగా వృద్ధులు, చిన్నారులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు(శనివారం) ఉదయం నుండే ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌తో సహా పలు చోట్ల పొగమంచు కమ్ముకుంది.

ఢిల్లీ వాతావరణంలో గతంలో కన్నా స్వల్ప మెరుగుదల కనిపించింది. టాప్-10 కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఏక్యూఐ240తో మొదటి, రెండవ స్థానాల నుండి 7వ స్థానానికి చేరుకుంది. దేశంలోని కాలుష్య నగరాల జాబితా ప్రకారం చూస్తే ఢిల్లీ ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతం ఏక్యూఐ 364తో వాయు నాణ్యత విషయంలో దారుణంగా ఉంది. ఏక్యూఐ ఉదయం 6 గంటలకు 364 వద్ద నమోదైంది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గాలి నాణ్యత తక్కువగా ఉండడానికి పంజాబ్-హర్యానాతో సహా పొరుగు రాష్ట్రాలలో గడ్డి తగులబెట్టడమే ప్రధాన కారణం. ప్రతి ఏటా ఈ సీజన్‌లో ఢిల్లీలోని గాలి విషపూరితంగా మారుతుంటుంది. దీపావళికి ముందే గాలిలో విషవాయువులు పెరుగుతున్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) డేటాను పరిశీలిస్తే 2021 సంవత్సరం నుండి ఇప్పటివరకు ప్రతీ అక్టోబర్‌లో కాలుష్య స్థాయి పెరిగింది.

ఇది కూడా చదవండి: ఒడిశాకు తప్పిన తుఫాను ముప్పు: సీఎం మోహన్‌ 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)