Breaking News

‘చవితి’ సందేశాలు తొలగించిన ప్రిన్సిపాల్‌ అరెస్ట్‌

Published on Mon, 09/09/2024 - 12:10

కోటా:  రాజస్థాన్‌లోని కోటాలో గల ఒక పాఠశాలలో వాట్సాప్ గ్రూప్‌లోని వినాయక చవితి సందేశాలను తొలగించిన పాఠశాల ప్రిన్సిపాల్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు చుక్కలు చూపించారు. మత సామరస్యానికి ప్రిన్సిపాల్‌ విఘాతం కలిగిస్తున్నాడంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

వివరాల్లోకి వెళితే కోటా జిల్లాలోని లాటూరి గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు వాట్సాప్‌లో ఒక బృందంగా ఏర్పడ్డారు. ఆ గ్రూప్‌లో వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు సందేశాలను పంపుతున్నారు. అయితే ప్రిన్సిపాల్ ఆ మెసేజ్‌లను డిలీట్ చేస్తూ వచ్చాడు. దీనికి ఆగ్రహించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌ను  ఎందుకిలా చేస్తున్నారంటూ నిలదీశారు.

విషయం పోలీసుల వరకూ చేరడంతో వారు వివాదం జరుగుతున్న పాఠశాలకు వచ్చారు. ఆందోళన చేస్తున్నవారిని శాంతింపజేశారు. తరువాత ప్రిన్సిపాల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, అరెస్టు చేశారు.  ప్రభుత్వ హయ్యర్‌ సెకండరీ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సోషల్‌ మీడియాలో గ్రూప్‌ ఏర్పాటు చేసినట్లు బాపవార్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో ఉత్తమ్‌సింగ్‌ తెలిపారు. భరత్  అనే వ్యక్తి ఈ వాట్సాప్ గ్రూప్‌లో గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపాడు. పాఠశాల తాత్కాలిక ప్రిన్సిపాల్ దానిని తొలగించారు.  ఇలాంటి సందేశాలను అతను తొలగిస్తూ వచ్చాడు. కాగా పోలీసులు ప్రిన్సిపాల్‌పై బీఎన్‌ఎస్‌సెక్షన్ 196 (మత సామరస్యానికి భంగం కలిగించడం) కింద కేసు నమోదు చేసుకుని,  అరెస్ట్ చేసి, దర్యాప్తు ప్రారంభించారు. 

Videos

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)