Breaking News

తేజస్‌ రాకలో జాప్యం ఆందోళనకరం

Published on Sun, 10/04/2026 - 05:08

న్యూఢిల్లీ: భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో వైమానిక శక్తి అత్యంత కీలకంగా మారుతోందని.. ఇలాంటి తరుణంలో తేజస్‌ యుద్ధ విమానాల రాకలో జరుగుతున్న విపరీతమైన జాప్యం భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌)పై ప్రతికూల ప్రభావం చూపుతోందని చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌ స్టాఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ పేర్కొన్నారు. ఇప్పటికే ఫైటర్‌ జెట్‌ స్క్వాడ్రన్ల బలం తగ్గుతోందని చెప్పారు. 94వ ‘ఎయిర్‌ఫోర్స్‌ డే’ను పురస్కరించుకొని ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.

 రాబోయే కొన్నేళ్లపాటు ఏటా కనీసం 36 నుంచి 40 యుద్ధ విమానాలను ఐఏఎఫ్‌లో చేర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ‘తేజస్‌ మార్క్‌–1ఏ’విమానాలు, మల్టీ–రోల్‌ ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌(ఎంఆర్‌ఎఫ్‌ఏ) కార్యక్రమం కింద సమకూరనున్న రఫేల్‌ యుద్ధ విమానాల రాకతో పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే.. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎంఆర్‌ఎఫ్‌ఏ ఒప్పందాన్ని ఖరారు చేసుకొని, సంతకాలు చేసే దిశగా ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో భారత్, ఫ్రెంచ్‌ మధ్య చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు. తేజస్‌ మార్క్‌–1ఏ యుద్ధ విమానాల సరఫరాలో జరుగుతున్న జాప్యం పట్ల కూడా ఏపీ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) ద్వారా జెట్ల సరఫరాలో జరుగుతున్న భారీ జాప్యంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఈ జాప్యం వైమానిక దళానికి నష్టం కలిగిస్తుంది’అని వ్యాఖ్యానించారు. ఐఏఎఫ్‌ కోసం 83 తేజస్‌ మార్క్‌–1ఏ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు 2021 ఫిబ్రవరిలో రక్షణ శాఖ హెచ్‌ఏఎల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ విలువ రూ.48,000 కోట్లు. మొదటి విడత విమానాలను 2024 మార్చిలో అందజేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఒక్క విమానం కూడా వైమానిక దళానికి అందలేదు.  

స్మిత్‌ మచ్ఛార్‌కు ఏపీ సింగ్‌ ప్రశంసలు  
ఫ్లై దుబాయ్‌ విమానాన్ని కాపాడటంలో భారతీయ కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛార్‌ అసాధారణ ధైర్యం ప్రదర్శించారని ఏపీ సింగ్‌ ప్రశంసించారు. ఆయనను చూసి ప్రతి భారతీయుడూ గర్వపడుతున్నట్లు చెప్పారు. మచ్ఛార్‌ చేసిన పని అత్యంత సాహసోపేతమైనదని తెలిపారు. విమానంలో దాడి జరిగినప్పటికీ గొప్ప శారీరక, మానసిక దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారని పేర్కొన్నారు.  

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)