రూ.79,000 కోట్ల ఆయుధాల సేకరణకు కేంద్రం ఓకే 

Published on Fri, 10/24/2025 - 06:21

న్యూఢిల్లీ: అత్యాధునిక ఆయుధాలు, సైనిక ఉపకరణాలతో త్రివిధ దళాలను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా రక్షణ శాఖ మరో భారీ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. మొత్తంగా రూ.79,000 కోట్ల విలువైన ఆయుధాలు, మిలటరీ హార్డ్‌వేర్‌ కొనుగోలుకు సంబంధించిన సమీకరణ ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సారథ్యంలోని రక్షణ కొనుగోళ్ల మండలి తమ సమావేశంలో ఆమోదముద్ర వేసింది. 

నాగ్‌ క్షిపణులు, బహుళచర ఆయుధ నౌకలు, ఎల్రక్టానిక్‌ సహిత ఇంటెలిజెన్స్, నిఘా వ్యవస్థలను సైతం కొనుగోలుచేయనున్నారు. సైనిక హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంక్‌లు, ఆయుధాలు, సైనిక బలగాలను తరలించేందుకు ఉపయోగించే ల్యాండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ డాక్స్‌(ఎల్‌పీడీ), 30 ఎంఎం నావల్‌ సర్ఫేస్‌ గన్స్‌(ఎన్‌ఎస్‌జీ), అడ్వాన్స్‌డ్‌ లైట్‌ వెయిట్‌ టార్పెడో(ఏఎల్‌డబ్ల్యూటీ), ఎలక్ట్రో ఆప్టికల్‌ ఇన్‌ఫ్రారెడ్‌ సెర్చ్‌ అండ్‌ సిస్టమ్‌తోపాటు 76 ఎంఎం సూపర్‌ ర్యాపిడ్‌ గన్‌ మౌంట్‌ ఆయుధం కోసం మందుగుండును కొనుగోలుచేయనున్నారు. 

ఆర్మీ, వాయుసేన తరహాలో ఇకపై నావికాదళం సైతం భూతల, గగనతలాల్లో ఆపరేషన్లు చేసేలా ఎల్‌పీడీలను సమీకరించి నేవీకి అందజేయనున్నారు. కనీసం నాలుగు ఎల్‌పీడీలను సమీకరించనున్నారు. ఏఎల్‌డబ్ల్యూటీను రక్షణపరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ)లోని నేవల్‌ సైన్స్, టెక్నాలజికల్‌ లే»ొరేటరీ దేశీయంగా తయారుచేసింది. ఎన్‌ఎస్‌జీతో సముద్రజలాల్లో చిన్నపాటి అత్యయక సేవల్లో పాల్గొనవచ్చు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారీ స్థాయిలో ఆయుధాల సమీకరణ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయడం ఇది రెండోసారి కావడం విశేషం. 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)