Breaking News

దీపోత్సవానికి అయోధ్య ముస్తాబు

Published on Mon, 10/28/2024 - 09:22

అయోధ్య: దీపావళి సందర్భంగా జరిగే దీపోత్సవ్‌ వేడుకలకు యూపీలోని అయోధ్య ముస్తాబవుతోంది. అక్టోబర్‌ 30న జరిగే దీపోత్సవ్‌ కోసం రామనగరిని అందంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తివిశ్వాసాల కలబోతతో అయోధ్య వెలుగులమయం కానుంది.

అయోధ్యలో జరిగే 8వ దీపోత్సవంలో అవధ్ యూనివర్సిటీకి చెందిన 30 వేల మంది వాలంటీర్లు దీపోత్సవ్ స్థలంలో 28 లక్షల దీపాలను అమర్చేందుకు కృషి చేస్తున్నారు. రామ్ కీ పైడిలోని 55 ఘాట్‌ల వద్ద జై శ్రీరామ్ నినాదాలతో వెలుగుల పండుగలో వాలంటీర్లు పాల్గొననున్నారు.

శ్రీరాముడు కొలువైన అయోధ్య ఈ సంవత్సరం దీపోత్సవం సందర్భంగా డిజిటల్ సిటీగా కనిపించబోతోంది. వెలుగుల సంగమం ఆవిష్కృతం కానుంది. ధరంపథ్‌ నుండి లతా మంగేష్కర్ చౌక్ వరకు, రంగురంగుల లైట్లు ఆకర్షణీయంగా కనువిందు చేయనున్నాయి.  ముఖ్యంగా లతా మంగేష్కర్ చౌక్  వెలుగు జిలుగులతో అత్యంత సుందరంగా కనిపించనుంది.

దీపోత్సవ వేడుకలకు నగరమంతా త్రేతాయుగంలా ముస్తాబైంది. త్రేతాయుగంలో రాముడు లంకను జయించి అయోధ్యకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. ఇప్పుడు వాటిని గుర్తు చేసేలా అయోధ్యను రంగురంగుల దీపాలతో అలంకరించారు.

లతా మంగేష్కర్ చౌక్ నుండి వివిధ కూడళ్లలో రామభక్తుల కోసం డిజిటల్ డిస్‌ప్లే వ్యవస్థను ఏర్పాటు చేశారు. రామభక్తులు దీపోత్సవ్ ప్రదేశానికి వెళ్లలేకపోయినా, డిజిటల్‌ తెరలపై దీపోత్సవాన్ని చూసి ఆస్వాదించవచ్చు.

రంగురంగుల దీపాలు అయోధ్య అందాన్ని మరింత పెంచుతున్నాయి. రామభక్తులు రాత్రిపూట అయోధ్య వీధుల్లోకి వెళ్లినప్పుడు తమను తాము మైమరచిపోయేలా దీపోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: అత్యంత వృద్ధ మహిళ అస్తమయం 
 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)