Breaking News

తెలంగాణలో తగ్గిన విదేశీ విద్యార్థులు

Published on Fri, 12/26/2025 - 02:22

సాక్షి, న్యూఢిల్లీ: ఒకప్పుడు విదేశీ విద్యార్థులతో కళకళలాడిన తెలంగాణలోని యూనివర్సిటీలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. దశాబ్ద కాలంలో దేశంలో అత్యధిక విదేశీ విద్యార్థులను ఆకర్షించే టాప్‌–10 రాష్ట్రాల జాబితా నుంచి తెలంగాణ కనుమరుగైంది. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘నీతి ఆయోగ్‌’తన తాజా నివేదికలో కుండబద్దలు కొట్టింది. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన ‘ఇంటర్నేషనలైజేషన్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ ఇండియా రిపోర్ట్‌’(2025) ప్రకారం..2012–13 విద్యా సంవత్సరంలో తెలంగాణలో 2,700 మంది విదేశీ విద్యార్థులు ఉండగా, 2021–22 నాటికి ఆ సంఖ్య దారుణంగా 1,286కు చేరుకుంది. పదేళ్లలో విదేశీ విద్యార్థుల సంఖ్య సగానికి పైగా పడిపోయింది.

తెలంగాణ వెనకడుగు.. 
ఓవైపు తెలంగాణలో విదేశీ విద్యార్థుల సంఖ్య పాతాళానికి పడిపోతుంటే, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మాత్రం ఈ విషయంలో దూసుకుపోతోంది. 2012–13లో కేవలం 679 మంది విదేశీ విద్యార్థులు మాత్రమే ఉన్న ఏపీలో, 2021–22 నాటికి ఆ సంఖ్య ఏకంగా 3,106కు చేరింది. తద్వారా ఏపీ దేశంలోనే 7వ స్థానంలో నిలిచింది. ఒకప్పుడు 4వ స్థానంలో వెలుగొందిన తెలంగాణ ఇప్పుడు కనీసం టాప్‌–10లో కూడా చోటు దక్కించుకోలేక చతికిలపడింది.

పశ్చిమ బెంగాల్‌తో పాటే..
దశాబ్ద కాలంలో (2012–2022) అంతర్జాతీయ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌లో టాప్‌–10 రాష్ట్రాల నుంచి వైదొలిగిన రెండే రెండు రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, తెలంగాణ కావడం గమనార్హం. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు తమ సామర్థ్యాన్ని పెంచుకుని విదేశీ విద్యార్థులకు గమ్యస్థానాలుగా మారుతుంటే, తెలంగాణ మాత్రం ఉన్న గుర్తింపును కోల్పోయింది.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)