Breaking News

413కు చేరిన వయనాడ్‌ మృతుల సంఖ్య

Published on Thu, 08/08/2024 - 13:46

కేరళలోని వయనాడ్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాలు కకావికలమయ్యాయి. ఈ భారీ విపత్తుకు బలయినవారి సంఖ్య 413కి చేరింది. ఇంకా 152 మంది ఆచూకీ తెలియాల్సివుంది. వారి కోసం 10వ రోజు(గురువారం)కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

కేంద్ర అధికారుల బృందం నేతృత్వంలో రక్షణ  ఏజెన్సీలకు చెందిన వెయ్యిమందికిపైగా సభ్యులు గురువారం తెల్లవారుజాము నుంచే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా వయనాడ్, మలప్పురం జిల్లాలోని చలియార్ నది గుండా వెళ్లే ప్రాంతాల్లో ఈ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నది నుండి మృతదేహాలను, శరీరభాగాలను వెలికితీసి తొలుత వాటిని డీఎన్‌ఏ పరీక్షకు పంపి, అనంతరం వాటిని గుర్తిస్తున్నారు.

ఆ తరువాత ఆ మృతదేహాలను ఖననం చేస్తున్నారు. ఆనంతరం ఆయా సమాధుల ముందు  నంబర్ల రాసి, డీఎన్ ఏ రిపోర్టు ఆధారంగా బంధీకులకు అధికారులు తెలియజేస్తున్నారు. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో వందకుపైగా సహాయక శిబిరాలు  ఏర్పాటు చేయగా, 10వేలమందికిపైగా బాధితులు వీటిలో ఆశ్రయం పొందుతున్నారు. బాధితులకు మూడు దశల్లో పునరావాసం కల్పిస్తామని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. 

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు