Breaking News

11ఏళ్ల పాప కప్‌బోర్డ్‌లో ఆత్మహత్య చేసుకుంటుందా?

Published on Tue, 10/21/2025 - 21:05

కోల్‌కతా: ఆర్జీకర్‌ మెడికల్‌ కాలేజీ జూనియర్‌ వైద్యురాలి కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఈసారి అతని కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. అతని మేన కోడలు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందింది.

కోల్‌కతా భోవానిపూర్ ప్రాంతంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. సోమవారం 11 ఏళ్ల బాలిక అల్మారాలో శవమై కనిపించింది. బాలికను పాక్షికంగా ఉరికి వేలాడుతుండడాన్ని స్థానికులు గుర్తించారు. బాలిక మరణానికి బాలిక త్రండి భోళా సింగ్‌, సవతి తల్లి  పూజ కారణమంటూ స్థానికులు వారిపై దాడి తెగబడ్డారు. తండ్రి, సవతి తల్లి.. బాలికను మానసికంగా,శారీరకంగా హింసించి ఆపై ప్రాణాలు తీశారు. ఈ దారుణంపై కోపంతో రగిలిపోయిన స్థానికులు భోళా సింగ్‌,పూజలకు దేహశుద్ధి చేశారు.  

స్థానికులు సవతి తల్లి జుట్టు పట్టుకుని తన్నారు. తండ్రిని బూట్లతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.దాడి చేస్తున్న స్థానికుల నుంచి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. బాలిక మృతిని అనుమానాస్పద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

బాలిక మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. పోస్టు మార్టం పూర్తయిన తర్వాత బాలికది ఆత్మహత్యనా? హత్యనా? అన్నది తెలుస్తోందని పోలీసులు తెలిపారు. అయితే, పోలీసుల తీరుపై స్థానికులు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 11ఏళ్ల బాలిక కప్‌బోర్డులో ఆత్మహత్య చేసుకుంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. బాలిక మరణానికి కారణమైన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

కోల్‌కతాలోని ఆర్జీకర్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఆసుపత్రిలో 2024 ఆగస్టు 9న జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసుపై విచారణ పూర్తి చేసిన సీల్ధా జిల్లా కోర్టు, సంజయ్‌ రాయ్‌ను ప్రధాన నిందితుడిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. అర్ధరాత్రి సమయంలో విధుల్లో ఉన్న వైద్యురాలిపై సంజయ్‌ రాయ్‌ అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)