Breaking News

షాకింగ్‌ ఘటన: ‘చనిపోయిన వ్యక్తి’ సీఎం, డీజీపీలకి లేఖ!

Published on Tue, 05/02/2023 - 07:50

కొన్నికేసులు చాలా విచిత్రంగా ఉంటాయి. కారణాల రీత్యా చిక్కుముడి వీడని కేసులు అకస్మాత్తుగా తెరపైకి వచ్చి అధికారులను షాక్‌ గురి చేస్తాయి. క్లోజ్‌ అయ్యిందన్న కేసు కాస్త అంతుపట్టని విధంగా అధికారులకు మరో సమస్యను తెచ్చిపెడుతుంటాయి . అచ్చం అలాంటి ఘటనే బిహార్‌లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఆరు నెలల క్రితం చనిపోయాడు. ఆ వ్యక్తి తాను బతికే ఉన్నానని, తనకు పెళ్లైందంటూ సీఎం నితీష్‌ కుమార్‌కు, డీజీపీకి, పోలీస్టేషన్‌కి లేఖ రాశాడు. ఆ లేఖ రాసిన వ్యక్తి ఆరు నెలలక్రితం చనిపోయిన మిస్సింగ్‌ కేసు వ్యక్తి సోనుగా శ్రీ వాస్తవ్‌గా గుర్తించారు.

పోలీసుల రికార్డుల ప్రకారం..పాట్నాలోని ఓ కుటుంబం 30 ఏళ్ల సోను శ్రీ వాస్తవ్‌ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. అతను ఇంటికి కావాల్సిన వస్తువులు కొనడానికి వెళ్లి తిరిగా రాలేదంటూ సోను తండ్రి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసు అధికారి ఉదయ్‌ కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ..బాధితుడు(సోను) తండ్రి ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా..రెండు రోజుల అనంతరం సోషల్‌ మీడియాలో గొంతుకోసిన మృతదేహం వైరల్‌ అయ్యింది. ఆ చనిపోయిన వ్యక్తి తమ కొడుకేనని సోను కుటుంబం చెప్పడంతో మేము కిడ్నాప్‌ కమ్‌ హత్య కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించాం

అతను మిస్సైన రోజు చివరి ఫోన్‌కాల్‌ లోకేషన్‌ ట్రేస్‌ చేసి పట్టుకునేందుకు యత్నించినా సాధ్యం కాలేదు, శ్రీ వాస్తవ్‌ అదృశ్యం కేసు చిక్కుముడి వీడలేదన్నారు ఉదయ్‌ సింగ్‌. కాగా, పోలీసులు కూడా అతడు చనిపోయాడనే భావించారు. కానీ ఇప్పుడూ తెరపైకి వచ్చి ఈ లేఖ ఘటనతో ఒక్కసారిగా నిర్ఘాంత పోయారు అధికారులు. అంతేగాదు ఆ చనిపోయాడనుకున్న సోను తన లేఖలో తాను ఉత్తరప్రదేశ్‌లో తన భార్యతో కలిసి ఉంటున్నానని చెప్పాడు.

పైగా తాను ఇంటికి కావల్సిన వస్తువులు కొనడానికని చెప్పి రూ. 50 వేలు తీసుకుని బస్సు ఎక్కినట్లు తెలిపాడు. సోను ఆ లేఖ తోపాటు తనకు పెళ్లైనట్లు ప్రూవ్‌ చేసే సాక్ష్యాధారాలను సైతం జత చేయడం విశేషం. లేఖ చివర్లో తన పేరు మీద కిడ్నాప్‌ కమ్‌ మర్డర్‌ కేసు పెట్టడం సరికాదని పేర్కొన్నాడు. దీంతో పోలీసులు అతడి కుటుంబానికి సమాచారం అందించడమే గాక తదుపరి దర్యాప్తు చేయడం ‍ప్రారంభించారు. 

(చదవండి: సీనియర్‌ సిటిజన్లకు రాయితీల రద్దుతో.. రైల్వే శాఖకు రూ.2,242 కోట్లు)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)