Breaking News

తొక్కిసలాట జరిగినా మారలేదు..!మళ్లీ గందరగోళమే..

Published on Sun, 02/16/2025 - 15:43

న్యూఢిల్లీ:దేశ రాజధాని న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగి 18 మంది మృతి చెందిన తర్వాత కూడా పరిస్థితి మారలేదు. మరుసటి రోజు ఆదివారం(ఫిబ్రవరి16) కూడా రైల్వేస్టేషన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.దీనికి కారణం సీట్ల కోసం ప్రయాణికులు ముందు వెనుకా చూసుకోకుండా మిగిలిన వారిని తోసుకుంటూ వెళ్లి రైళ్లు ఎక్కడమే కారణం.

శనివారం సాయంత్రం తొక్కిసలాట జరిగిన చోటుకు దగర్లోనే ప్లాట్‌ఫాం నంబర్‌ 16 దగ్గర బీహార్‌ సంపర్క్‌ క్రాంతి రైలు కోసం ప్రయాణికులు మళ్లీ ఎగబడ్డారు.భారీ లగేజ్‌ పట్టుకుని ఒకరిని ఒకరు తోసుకుంటూ ఎలాగైనా రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ బీభత్సం సృష్టించారు. ఒక ముసలావిడనైతే ఎమర్జెన్సీ కిటికి నుంచి రైలులోకి నెట్టడానికి ప్రయత్నించగా ఆమె అందులో ఇరుక్కుపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

రైలు డోర్‌ దగ్గర ఆ ముసలావిడ ఎక్కలేని పరిస్థితి ఉండడం వల్లే ఆమెను ఎమర్జెన్సీ కిటికీ నుంచి నెట్టారు.ఇంతేకాకుండా దర్బంగా వెళ్లే రైలు ప్లాట్‌ఫాంపైకి రాగానే రైలులోకి ఎక్కేందుకు రిజర్వేషన్‌లేని, రిజర్వేషన్‌ కన్ఫామ్‌ కాని ప్రయాణికులు ఒక్కసారిగా ఎగబడ్డారు.

ఎమర్జెన్సీ కిటీకిలో నుంచి లగేజ్‌లను విసురుతూ సీట్లు ముందుగానే ఆపేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలోనే అడ్డొచ్చిన వారిని నెట్టివేయడం గందరగోళానికి దారి తీసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ రైల్వేప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఆర్పీఎఫ్‌)కు సంబంధించిన ఒక్క పోలీసు లేకపోవడం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఉన్న దారుణమైన పరిస్థితులను అద్దం  పడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)