Breaking News

కూతురివేనా నువ్వు.. తల్లిని నిర్బంధించి కిరాతకంగా దాడి(వీడియో)

Published on Sun, 03/02/2025 - 09:46

హిసార్‌: ఆస్తి కోసం కూతురు తన తల్లిని చిత్రహింసలకు గురిచేసిన హృదయవిదారక వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రక్తం తాగుతాను అంటూ కన్న తల్లినే కూతురు హింసించింది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. దీనిపై ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

వివరాల ‍ప్రకారం.. హర్యానాలోని హిసార్‌కు చెందిన రీటాకు రెండేళ్ల క్రితం రాజ్‌గఢ్ సమీపంలోని గ్రామానికి చెందిన సంజయ్ పునియాతో వివాహం జరిగింది. వీరికి వివాహం జరిగిన సమయంలో పునియాకు ఎలాంటి సంపాదన లేదు. దీంతో, రీటా.. తన తల్లి నిర్మలాదేవి ఇంటికి తిరిగి వచ్చేసింది. తల్లి ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే ఆస్తి కోసం తన తల్లిని నిర్భందించి వేధించడం ప్రారంభించింది.

రీటా.. ఇప్పటికే కురుక్షేత్రలో తమ కుటుంబానికి చెందిన పలు ఆస్తులను అమ్మేసి దాదాపు రూ.65 లక్షలు తన దగ్గర ఉంచుకుంది. ఇప్పుడు తల్లి నివసిస్తున్న ఇంటిని తన పేరుమీదకు మార్చాలని వేధింపులకు గురిచేస్తోంది. ఇంటిని తన పేరు మీద రిజిస్టర్ చేయమని తల్లిని ఇంత దారుణంగా హింసించింది. ఈ సందర్భంగా రీటా.. ఆస్తి ఇస్తావా లేదా? నీ రక్తం తాగుతా అంటూ జుట్టు లాగి కొడుతూ, నోటితో కొరుకుతూ నానా విధాలుగా హింసించింది. దీంతో, నిర్మలాదేవి రోదిస్తూ రెండు చేతులూ జోడించి వేడుకుంటోంది. ఈ వీడియోలో ఒక పురుషుడి మాటలు కూడా వినిపిస్తున్నాయి. ​కాగా, తన తల్లిపై దాడి విషయం తెలియడంతో ఆమె కుమారుడు అమర్‌దీప్‌.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఇంట్లోకి రానివ్వడం లేదని తెలిపాడు. రీటాపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)