Breaking News

కోడలి వివాహేతరం సంబంధం.. రాగి ముద్దలో విషం పెట్టి..!

Published on Mon, 08/25/2025 - 13:09

 కర్ణాటక: అక్రమ సంబంధాల మోజులో మానవత్వం మృగ్యమవుతోంది. ప్రియుని కోసం రాగి ముద్దలో విషం కలిపి అత్తను హత్య చేసిన ఘటన చిక్కమగళూరు జిల్లా అజ్జంపుర తాలూకా తడగ గ్రామంలో జరిగింది. అశ్విని అనే వివాహిత తన అత్త దేవీరమ్మ (75) హతమార్చింది. వివరాలు.. అశ్వినికి ఆంజనేయ అనే వ్యక్తితో ఆక్రమ సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి అత్త ఆమెను తీవ్రంగా మందలించింది. ఇటీవల అశ్విని ఇంట్లో నగలను తీసుకుని ప్రియునికి అప్పగించింది. 

ఇది తెలిసి కోడలిని అత్త నిలదీసింది. తమకు అడ్డుగా ఉన్న దేవీరమ్మను అడ్డు తొలగించాలని అశ్విని నిశ్చయించుకుంది. గురువారం రాత్రి రాగిముద్దలో పురుగుల మందును కలిపి అత్తకు ఇచ్చింది. అది ఆరగించిన దేవీరమ్మ తెల్లవారినా నిద్రలేవలేదు. అనారోగ్యంతో ఆమె మృతి చెందినట్లు అశ్విని అందరికీ చెప్పింది. అయితే తల్లి చావుపై దేవీరమ్మ కూతురికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అశ్వినిని పిలిచి తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకొంది. ప్రియుడు ఆంజనేయను కూడా అరెస్టు చేశారు. 100 గ్రాముల బంగారం, రూ.50 వేల నగదును అశ్విని స్వాహా చేసిందని బంధువులు తెలిపారు.

 

 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు