Breaking News

మరో 40 ఏళ్లు జీవించాలనుకుంటున్నా 

Published on Sun, 07/06/2025 - 06:12

ధర్మశాల: టిబెటన్ల అత్యున్నత ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా త్వరలో తన వారసుడిని ప్రకటిస్తారన్న వార్తలకు చెక్‌పెడుతూ దలైలామా శనివారం తన మనసులో మాట వెల్లడించారు. మరో 30–40 ఏళ్లు జీవించాలనే ఆశ ఉందని, తుదిశ్వాస వరకు బుద్ధుని బోధనలను శక్తివంచలేకుండా వ్యాప్తి చెందిస్తానని ఆయన ప్రకటించారు. జీవించి ఉన్నంతకాలం తానే లామాగా కొనసాగుతానని ఆయన పరోక్షంగా చెప్పారు.

 ఆదివారం తన 90వ పుట్టినరోజును పురస్కరించుకుని హిమాలయాల్లోని మెక్లియోడ్‌గంజ్‌ పట్టణంలోని సుగ్లాగ్‌ఖాంగ్‌ ఆలయంలో దలైలామా ఆయుష్ష బాగుండాలంటూ శనివారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. శక్తిస్వరూపిణిగా పేర్కొనే ‘ఒరాకిల్‌’.. దలైలామా చెంతకొచ్చి ఆయనను ఆశీర్వదించింది. ఒరాకిల్‌ ఆవాహనను ఈ ప్రత్యేక ప్రార్థనల్లో కీలకఘట్టంగా చెప్పొచ్చు. 

ఈ ప్రత్యేక ప్రార్థనల్లో కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దలైలామా మీడియాతో మాట్లాడారు. ‘‘కాలజ్ఞానం నాకేదో చెబుతున్నట్లు అనిపిస్తోంది. నాపై అవలోకితేశ్వర ఆశీస్సులు కురుస్తున్నట్లు తోస్తోంది. ఇప్పటికే నా శాయశక్తులా కృషిచేశా. ఇలా బుద్దుని బోధనలను వ్యాప్తి చెందించేందుకు నేను మరో 30–40 సంవత్సరాలు జీవించాలని ఆశ పడుతున్నా. నాపై అవలోకితేశ్వర ప్రభావం చిన్నతనం నుంచే ఉంది. బౌద్ధధర్మాన్ని మరికొంత కాలం ప్రపంచానికి చాటిచెబుతా. అందులోభాగంగానే 130 ఏళ్లు వచ్చేవరకు జీవిస్తాననే భావిస్తున్నా’’అని అన్నారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)