Breaking News

రఫేల్‌ యుద్ధ విమానాల డీల్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

Published on Thu, 02/12/2026 - 15:25

ఢిల్లీ: రఫేల్‌ యుద్ధ విమానాల డీల్‌కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  ఈ మేరకు ఫ్రాన్స్‌తో రూ. 3 లక్షల 25 వేల కోట్లతో రఫేల్‌ యుద్ధ విమానాల డీల్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. మొత్తం 114 రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్‌ ఆర్డర్‌ ఇచ్చినట్లు Defence Acquisition Council (DAC) స్పష్టం చేసింది.

ఈ నెల 18వ తేదీన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ .. భారత్‌కు రానున్నారు. అయితే మేక్రాన్‌ పర్యటనకు ముందే రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ీడీల్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది భారత రక్షణ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందాల్లో ఒకటిగా భావిస్తున్నారు.

ఈ డీల్‌ ద్వారా భారత వాయుసేనకు ఆధునిక సాంకేతికతతో కూడిన శక్తిమంతమైన యుద్ధ విమానాలు లభిస్తాయి. ప్రధానంగా ఉత్తర, పశ్చిమ సరిహద్దుల వద్ద పెరుగుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో ఇది మరింత కీలకం కానుంది.  మరొకవైపు భారత నేవీ కోసం, Scalp Cruise Missiles ఇతర రక్షణ సామగ్రిని కూడా కొనుగోలు చేయనున్నారు.

కాగా, భారత్ ఇప్పటివరకు రెండు ప్రధాన సందర్భాల్లో రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. 2016లో ఎయిర్‌ఫోర్స్‌ను మరింత పటిష్టం చేసేందుకు 36 రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. ఫ్రాన్స్‌తో రూ. 59 వేల కోట్లతో ఈ విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. 2020లో మొదటి బ్యాచ్ భారత్‌కు చేరింది, 2022 నాటికి అన్ని విమానాలు ఐఏఎఫ్‌లో చేరాయి.

ఇక నేవీ కోంస 2025 ఏప్రిల్‌లో భారత్‌ రూ. 63 వేల కోట్లతో మరో ఒప్పందం కుదుర్చుకుంది.  22 సింగిల్‌ సీట్‌, 4 ట్విన్‌ సీట్‌, రఫేల్‌ మెరైన్‌ జెట్స్‌ను భారత్‌ కొనుగోలు చేసింది. ఇవి ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌, ఐఎన్‌ఎస్‌ విక్రమాధిత్యా ఎయిర్‌క్రాఫ్ట్‌పై మోహరించబడతాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)