ఆపరేషన్ మ్యాట్రిక్స్: భారీ సెక్స్‌టార్షన్ ముఠా గుట్టురట్టు

Published on Sat, 02/21/2026 - 18:57

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా కేంద్రంగా సాగుతున్న భారీ సైబర్ సెక్స్‌టార్షన్, 'డిజిటల్ అరెస్ట్' రాకెట్‌ను పోలీసులు ఛేదించిన వైనం కలకలం రేపింది. 'ఆపరేషన్ మ్యాట్రిక్స్' పేరుతో చేపట్టిన ఈ దాడిలో 20 మంది అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టైంది. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు రూ. 1.07 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

శివపురి ఎస్పీ అమన్ సింగ్ రాథోడ్  ఈ అరెస్టులను ధృవీకరించారు. శనివారం జరిగిన ఈ ఆపరేషన్‌లో గ్వాలియర్ జోన్ ఐజీ అరవింద్ కుమార్ సక్సేనా, డీఐజీ అమిత్ సంఘీ ఆదేశాల మేరకు తొమ్మిది ప్రత్యేక బృందాలు శివపురి జిల్లాలోని కరేరా, భోంతి, పిచ్చోర్ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించాయని ఆయన తెలిపారు.

అసలేంటీ  రాకెట్‌
పకడ్బందీ పథకం ప్రకారం ఈ ముఠా సభ్యులు  మోసాలకు  పాల్పడేవారు. మొదట వాట్సాప్‌లో మహిళల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించేవారు. డేటింగ్ ,టింగ్ యాప్‌ల ద్వారా బాధితులను ఆకర్షించి, వారితో అసభ్యకరమైన చాట్లు,వీడియో రికార్డింగ్‌లు చేసేవారు. ఆతరువాత బాధితుల వ్యక్తిగత వీడియోలు సేకరించిన తర్వాత, తమ నిజప్వరూపాన్ని బయటపెట్టేవారు.  తాము పోలీస్ అధికారులమని పరిచయం చేసుకుని, బాధితులపై అత్యాచారం, చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులు నమోదయ్యాయని భయపెట్టి, బెదిరింపులకు పాల్పడేవారు. ఈ కేసుల నుండి తప్పించుకోవాలంటే భారీగా డబ్బు చెల్లించాలని  డిమాండ్‌ చేయడం వీరి మోడస్‌ ఒపరాండీ.

గత వారంలో నమోదైన నాలుగు ఎఫ్ఐఆర్లలో మొత్తం 32 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో ఇప్పటివరకు 20 మందిని అరెస్ట్ చేయగా, మరో 12 మంది పరారీలో ఉన్నారు. అరెస్టయిన వారిలో అంగద్ లోధి, విశాల్ లోధి, సుఖ్‌దేవ్, అర్జున్, దీపక్ ప్రజాపతి తదితరులు ఉన్నారు. వీరిలో మెజారిటీ నిందితులు శివపురి మరియు ఝాన్సీ ప్రాంతాలకు చెందినవారే.

రూ. 1.20 లక్షల నగదు, ఏటీఎం  కార్డులు, బ్యాంక్ పాస్‌బుక్కులతోపాటు  7 నాలుగు చక్రాల వాహనాలు, 29 స్మార్ట్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ. 1.07 కోట్లు అని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: సుందర్‌ పిచాయ్‌తో సరదాగా, సర్‌ప్రైజింగా : వైరల్‌ వీడియోలు

పోలీసుల హెచ్చరిక
 అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాథోడ్ ప్రజలను  ఈ సందర్బంగా కోరారు. తెలియని నంబర్ల నుండి వచ్చే వీడియో కాల్‌లను ఎత్తవద్దనీ,  ఒకవేళ ఎవరైనా 'డిజిటల్ అరెస్ట్' పేరుతో బెదిరింపులకు పాల్పడితే, వెంటనే స్థానిక పోలీసులను లేదా సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు. ‌

ఇదీ చదవండి: బంగారాలూ..మీరే నా సర్వస్వం : నటుడి భావోద్వేగ సందేశం

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)