Breaking News

జైలు నుంచే జడ్జికి బెదిరింపు

Published on Mon, 11/10/2025 - 02:28

లక్నో: సుమారు రూ.3,700 కోట్ల సైబర్‌ నేరానికి పాల్పడిన ఆరోపణలపై జైలులో ఉన్న ఓ వ్యక్తి..పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫోన్‌ నుంచి అలహాబాద్‌ హైకోర్టు జడ్జికి బెదిరింపు మెయిల్‌ పంపించడం సంచలనం రేపింది. అనుభవ్‌ మిట్టల్‌ అనే వ్యక్తి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో దాదాపు 7 లక్షల మందిని మోసం చేశాడు. ప్రస్తుతం లక్నో జైలులో ఉన్న ఇతడిపై ఈ మేరకు కేసు నమోదైంది. ఇతడు అజయ్‌ అనే పోలీస్‌ కానిస్టేబుల్‌ సెల్‌ ఫోన్‌ ద్వారా అలహాబాద్‌ హైకోర్టు జడ్జికి బెదిరింపు మెయిల్‌ పంపాడు. మరో ఖైదీని ఇరికించేందుకు మారుపేరుతో ఇతడు.. ‘లక్నో బెంచ్‌లోని ఓ జడ్జిని చంపేస్తాం’అంటూ మెసేజీ పంపాడు.

దీనిపై శుక్రవారం కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కానిస్టేబుల్‌ అజయ్‌ని ప్రశ్నించారు. ఈ నెల 4వ తేదీన కోర్టు విచారణకు వచ్చిన మిట్టల్‌ వెంట కానిస్టేబుల్‌ అజయ్‌ ఉన్నాడు. తన కేస్‌ స్టేటస్‌ చూస్తానంటూ ఫోన్‌ను తీసుకున్న మిట్టల్‌ కొత్త మెయిల్‌ ఐడీ సృష్టించి బెదిరిస్తూ మెయిల్‌ పంపించాడు.  హత్య కేసులో అదే జైలులో 2023 నుంచి ఉంటున్న తన విరోధి ఆనందేశ్వర్‌ అగ్రహారీని ఈ కేసులో ఇరికించేందుకు మిట్టల్‌ కుట్ర పన్నినట్లు తెలిందని అధికారులు తెలిపారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)