Breaking News

ఏఐ పాఠాలు

Published on Fri, 10/31/2025 - 06:20

సాక్షి, న్యూఢిల్లీ: దేశ విద్యా వ్యవస్థలో మరో విప్లవాత్మక మార్పునకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అన్ని పాఠశాలల్లోనూ 3వ తరగతి నుంచే ఆర్టిఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), కంప్యూటేషనల్‌ థింకింగ్‌ (సీటీ)ను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని కేంద్ర విద్యా శాఖ నిర్ణయించింది. జాతీయ విద్యా విధానం–2020 జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం (ఎన్సీఎఫ్‌ఎస్‌ఈ) 2023 సిఫార్సుల మేరకు పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయను న్నారు. ఈ నెల 29వ తేదీన సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీ, కేంద్రీయ విద్యాలయ సంగఠన్, నవోదయ విద్యాలయ సమితి ప్రతినిధులు, ఇతర విద్యా రంగ నిపుణులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌ కుమార్‌ ఈ విషయం తెలిపారు.

ఏఐ విద్యను మన చుట్టూ ఉన్న ప్రపంచంతో ముడిపడి ఉన్న ఒక ప్రాథమిక సార్వత్రిక నైపుణ్యంగా పరిగణించాలన్నారు. ప్రజా ప్రయోజనం కోసం ఏఐ అనే భావనను బలోపేతం చేయడం, సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించడానికి ఏఐను నైతికంగా ఉపయోగించడంపై పునాది స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలి్పంచడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఏఐ, సీటీ పాఠ్యాంశాల రూపకల్పన కోసం సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఐఐటీ మద్రాస్‌కు చెందిన ప్రొఫెసర్‌ కార్తీక్‌ రామన్‌ అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామన్నారు.

నూతన పాఠ్యాంశాల అమలులో ఉపాధ్యాయ శిక్షణ అత్యంత కీలకమని కార్యదర్శి సంజయ్‌ కుమార్‌ తెలిపారు. ఇందుకోసం ‘నిష్ఠ’శిక్షణా మాడ్యూల్స్, వీడియో ఆధారిత వనరులను విస్తృతంగా ఉపయోగించుకోనున్నారు. గ్రేడ్‌ల వారీగా ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలను పరిశీలిస్తూనే దేశ అవసరాలకు తగినట్లుగా పాఠ్యాంశాలను రూపొందించాలని సంజయ్‌ కుమార్‌ సూచించారు. డిసెంబర్‌ కల్లా పాఠ్యాంశాల అభివృద్ధి పూర్తి చేయాలన్నారు. 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)