Breaking News

ఒకరు దాడికి సిద్ధంగా ఉండగా..  మరొకరు దొంగతనం.. 

Published on Fri, 08/15/2025 - 05:59

ఇండోర్‌: ముఖాలకు ముసుగులు, చేతులకు గ్లోవ్స్‌ ధరించిన ముగ్గురు దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. ఏకంగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లారు. బెడ్‌మీద నిద్రపోయిన వ్యక్తి లేస్తే.. కొట్టడానికి సిద్ధంగా ఒకరు చేతిలో రాడ్‌ పట్టుకుని ఉండగా.. మరొకరు బీరువాలో ఉన్న సొమ్మును దొంగిలించారు. ఇంకొకరు డోర్‌ దగ్గర కాపలాగా ఉన్నారు. దాదాపు 20 నిమిషాల పాటు ప్రశాంతంగా ఇంటిని దోచుకున్నారు. అయితే.. హెచ్చరిక అలారం మోగినప్పటికీ ఇంట్లో ఉన్న వ్యక్తి నిద్ర లేవలేదు. దుండగులు రూ.లక్షల నగదు, విలువైన వస్తువులను తీసుకెళ్లారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గౌహతి హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ రమేష్‌ గార్గ్‌ ఇంట్లో జరిగిన దోపిడీ.

 ఈ ఘటనంతా ఇంట్లోని బెడ్‌రూమ్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. దోపిడీ జరిగిన సమయంలో అతని కుటుంబం గాఢ నిద్రలో ఉంది. ఈ సంఘటన రక్షా బంధన్‌ రోజున జరిగింది. అదే రోజు సమీపంలోని అనేక ప్రాంతాల్లో దోపిడీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను స్వా«దీనం చేసుకోగా విషయం వెలుగులోకి వ చ్చింది. అన్ని చోట్లా దొంగలు ముసుగులు, చేతులకు గ్లోవ్స్‌ ధరించి ఉన్నారు. దొంగతనాలు చాలా పద్ధతిగా చేసినట్లు కనిపిస్తోంది. దీంతో.. వీటిపై దర్యాప్తు చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)