Breaking News

నేర చరితుల్లో నంబర్‌ వన్‌!

Published on Fri, 09/05/2025 - 04:44

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అత్యధికంగా చంద్రబాబు మంత్రివర్గంలో నేర చరితులు ఉన్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫార్మ్స్‌ (ఏడీఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ (ఎన్‌ఈడబ్ల్యూ) సంయుక్త నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో 96 % మంది మంత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించి రూపొందించిన తాజా నివేదికలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వంతోపాటు 27 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మంత్రులకు సంబంధించిన వివరాలు ఇందులో పొందుపరిచారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై 19 క్రిమినల్‌ కేసులు ఉండగా మంత్రి నారా లోకేశ్‌పై 17 క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇక దేశంలో అత్యధిక ఆస్తులు కలిగిన టాప్‌ 10 అధికార పార్టీల ప్రజా ప్రతినిధుల్లో టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ రూ.5,705 కోట్లతో మొదటి స్థానంలో నిలవగా రూ.931 కోట్ల సంపదతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడో స్థానంలో ఉన్నారు.

రూ.824 కోట్లతో మునిసిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నాలుగో స్థానంలో, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రూ.542 కోట్లతో ఏడో స్థానంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. అతి తక్కువ ఆస్తులు కలిగిన వారిలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.15.38 లక్షలతో ఎనిమిదో స్థానంలో ఉండటం గమనార్హం.

కేంద్ర మంత్రుల్లో బండి సంజయ్‌ టాప్‌.. 
కేంద్ర మంత్రుల్లో తెలంగాణకు చెందిన బండి సంజయ్‌ కుమార్‌పై 42, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాపై 3, నితిన్‌ గడ్కరీపై 10, కింజరాపు రామ్మోహన్‌ నాయుడుపై 4 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.  హరియాణ, జమ్మూ–కశ్మిర్, నాగాలాండ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలలో ఒక్క మంత్రిపైనా కేసు లేదు.  

తెలంగాణలో క్రిమినల్‌ కేసులకు సంబంధించి సీఎం అనుముల రేవంత్‌రెడ్డి (89), డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (3), జూపల్లి కృష్ణారావు (3), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (6), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (5), గడ్డం వివేకానంద (5), కొండా సురేఖ (5), అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ (13), ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (11), పొన్నం ప్రభాకర్‌ (7), సీతక్క (6) కేసులు ఉన్నాయి. 

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)