Breaking News

స్కోరుంటేనే.. లోన్‌

Published on Mon, 06/30/2025 - 02:53

తాను వివాహం చేసుకోబోయే వ్యక్తి క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉందని ఓ యువతి పెళ్లికి నిరాకరించింది. మహారాష్ట్రలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలుగు చూసిన ఈ ఘటన అందరినీ నివ్వెరపోయేలా చేసింది. మరో సంఘటనలో క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉన్న వ్యక్తి ఉద్యోగ నియామకాన్ని రద్దు చేసిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయాన్ని మద్రాస్‌ హైకోర్టు సమర్థించింది. ఈ రెండు సందర్భాల్లోనూ రెండు జీవితాలను క్రెడిట్‌ స్కోర్‌ మార్చేసింది. క్రెడిట్‌ స్కోర్‌ అంత ముఖ్యమా.. ఇంతకీ ఈ స్కోర్‌ ఏమిటి.. ఎవరు, ఎలా నిర్ణయిస్తారు.. సామాన్యుల మదిలో ఉన్న సందేహాలకు జవాబు తెలుసుకుందాం. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

నాకు లోన్  కావాలి. క్రెడిట్‌ స్కోర్‌  ఉంటేనే ఇస్తామన్నారు. ఏమిటీ స్కోర్‌?
ఓసారి మీ స్నేహితులనో, బంధువులనో ఓ రూ.లక్షో.. 2 లక్షలో చేబదులు అడిగి చూడండి! ఎంతమంది ఇచ్చి ఉంటారు? ఎంతమంది బంగారమో, ఇంటి పత్రాల వంటి హామీలు అడిగి ఉంటారు? మీరు బాగా తెలిసినవారే అయినా మీరు తిరిగి చెల్లించగలరా అని వందసార్లు ఆలోచిస్తారు. అలాంటిది మీరెవరో తెలియకుండా ఓ బ్యాంకు లేదా లోన్‌ యాప్‌ మిమ్మల్ని నమ్మి, ఎలాంటి తనఖా లేకుండా అప్పు ఎలా ఇస్తాయి? అందుకే, మీరేంటి.. గతంలో ఏదైనా బ్యాంక్‌ నుంచి లోన్  తీసుకుంటే తిరిగి ఎలా చెల్లించారు.. చెల్లించకుండా ఎగ్గొట్టారా..  వంటి అంశాలన్నీ వారు చూస్తారు. 

ఇలా వినియోగదారుడి రుణ అర్హతను సూచించే సంఖ్యే క్రెడిట్‌ స్కోర్‌. దీని ఆధారంగానే బ్యాంకులు, నాన్  బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) ఒకరికి రుణం ఇవ్వాలా లేదా అని నిర్ణయిస్తాయి. చెల్లింపుల చరిత్ర, రుణ అర్హత–తీసుకున్న మొత్తాలు, కాల పరిమితి, తరచూ లోన్లకు దరఖాస్తులు, విభిన్న రుణాలు.. వీటి ఆధారంగా స్కోర్‌ మారుతుంది. మనదేశంలో తొలి క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ ట్రాన్స్యూనియన్  సిబిల్‌. ఈ కంపెనీ ఇచ్చే క్రెడిట్‌ స్కోర్‌.. సిబిల్‌ స్కోర్‌గా జనంలో బాగా పాపులర్‌ అయింది.

నా క్రెడిట్‌ స్కోరు తక్కువైతే రుణం రాదా? 
ఒక వ్యక్తి తాను తీసుకున్న రుణాలను నిర్వహించిన తీరు ఆధారంగా క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ/క్రెడిట్‌ బ్యూరోలు 300 నుంచి 900 వరకు స్కోర్‌ ఇస్తున్నాయి. స్కోర్‌ ఎంత ఎక్కువ ఉంటే రుణం లభించే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. 90 శాతం లోన్స్ 750కిపైగా స్కోర్‌ ఉన్నవారికే మంజూరు అవుతున్నాయి. ఆదాయం, ప్రస్తుత ఈఎంఐలు, క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగా రుణ అర్హతను ఆర్థిక సంస్థలు నిర్ణయిస్తాయి. 

ఏ కంపెనీలు ఈ స్కోర్‌ ఇస్తున్నాయి? వాటికి ఆర్‌బీఐ అనుమతి ఉందా?
క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ లేదా క్రెడిట్‌ బ్యూరోలు వ్యక్తులు, కంపెనీల రుణ సమాచారాన్ని ఆర్థిక సంస్థల నుంచి నెలవారీ ప్రాతిపదికన సేకరించి, నిర్వహణతోపాటు విశ్లేషిస్తాయి. ఈ రుణ సమాచారాన్ని ఉపయోగించి వ్యక్తుల కోసం క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌లు, కంపెనీల కోసం క్రెడిట్‌ కంపెనీ రిపోర్ట్‌లు రూపొందిస్తాయి. రుణ అర్హత, గత రుణ చరిత్ర ఆధారంగా వ్యక్తుల కోసం క్రెడిట్‌ స్కోర్, కంపెనీలకు క్రెడిట్‌ ర్యాంక్‌లను జారీ చేస్తాయి. ఆర్‌బీఐ లైసెన్స్ పొందిన క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీలు భారత్‌లో ట్రాన్స్యూనియన్  సిబిల్, ఈక్విఫ్యాక్స్‌ ఇండియా, ఎక్స్‌పీరియన్  ఇండియా, సీఆర్‌ఐఎఫ్‌ హై మార్క్‌. ఆర్‌బీఐ నియంత్రణలోనే ఇవి పనిచేస్తాయి. 

స్కోర్‌ ఎక్కువగా ఉంటే ప్రయోజనం ఏమిటి?
ట్రాన్స్యూనియన్  సిబిల్‌ గణాంకాల ప్రకారం 2025 జనవరి–మార్చిలో కొత్తగా మంజూరైన రుణాల్లో 57.6 శాతం వినియోగదారుల స్కోర్‌ 800లకుపైగా ఉంది. 22.8 శాతం మంది స్కోర్‌ 750–799 మధ్య, 9.7 శాతం వినియోగదారులకు 700–749 మధ్య, 5.2 శాతం కస్టమర్లకు 650–699 మధ్య, 4.7 శాతం మందికి 650 కంటే తక్కువ స్కోర్‌ ఉంది. 

స్కోర్‌ ఎక్కువగా ఉన్నవారికే లోన్  లభిస్తోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. గృహ, వాహన రుణాల వంటి సెక్యూర్డ్‌ లోన్స్కు సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉన్నా, క్రెడిట్‌ హిస్టరీ లేకున్నా రుణ సంస్థలు ముందుకు వస్తున్నాయి. వ్యక్తిగత రుణం,  విద్యా రుణాల వంటి అన్ సెక్యూర్డ్‌ లోన్స్కు క్రెడిట్‌ స్కోర్‌ ఉండాల్సిందే. 

కొత్త వాళ్లకు రుణం రాదంటున్నారు. నిజమేనా?
అలాంటిది ఏమీ లేదు. ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో లోన్లు తీసుకున్నవారిలో 16 శాతం మంది కొత్తవారే. ఉద్యోగులైతే వారు పనిచేస్తున్న కంపెనీని బట్టి రుణ సంస్థలు సూపర్‌–ఏ, కేటగిరీ–ఏ, బీ, సీ, డీ అని విభజించి రుణ మొత్తాన్ని, కాల పరిమితిని నిర్ణయిస్తున్నాయి. కంపెనీ పనితీరు కూడా లోన్  అప్లికేషన్ ను ప్రభావితం చేస్తుంది.

నాకు క్రెడిట్‌ హిస్టరీ లేదు. యూపీఐ వాడుతున్నాను. లోన్  వస్తుందా?
క్రెడిట్‌ హిస్టరీ లేని ఉద్యోగులు అయితే కనీసం మూడు నెలల పే స్లిప్స్‌ను సమర్పించాలి. ఎన్ బీఎఫ్‌సీలు చిన్న మొత్తాల్లో రుణం ఇస్తాయి. సకాలంలో చెల్లిస్తే క్రెడిట్‌ లిమిట్‌ (రుణ మొత్తం) పెంచుతాయి. యూపీఐ వాడుతున్న చిరు వ్యాపారులు, కార్మికులకు కూడా ఆదాయం, యూపీఐ చెల్లింపులను విశ్లేషించి ఎన్ బీఎఫ్‌సీలు చిన్న మొత్తాల్లో అప్పులు ఇస్తున్నాయి.

ఏది మంచి స్కోర్‌ ?
851-900 (అద్భుతం)
బకాయిలు లేని రుణగ్రహీతలు.

751-850  (మంచిది)
సకాలంలో చెల్లింపులతో బలమైన క్రెడిట్‌ చరిత్ర ఉన్నవారు.

651-750 (సగటు)
తగిన రుణ నిర్వహణతో సగటు రుణ చరిత్ర కలిగినవారు.

501- 650 (పేలవమైనది)
సమయానికి పూర్తికాని చెల్లింపులు, అధిక రుణ వినియోగం కారణంగా ఎక్కువ రిస్క్‌ ఉన్నవారు.

300 - 500 (చాలా పేలవమైనది)
బకాయిలు, రుణం పొందడంలో ఇబ్బందులతో దారుణమైన రుణ చరిత్ర  ఉన్నవారు.

రూ.50 లక్షల వరకు.. 
దరఖాస్తుదారు పనిచేస్తున్న కంపెనీ సూపర్‌–ఏ ప్లస్‌ విభాగంలో ఉండి, స్కోర్‌ మెరుగ్గా ఉంటే.. ఎన్ బీఎఫ్‌సీలు 8 ఏళ్ల కాల పరిమితితో రూ.50 లక్షల వరకు అన్ సెక్యూర్డ్‌ లోన్స్ ఇస్తున్నాయి. గతంలో ఈ కాల పరిమితి అయిదేళ్లు ఉండేది. కంపెనీల స్థిరత్వం, లాభ, నష్టాలు, ఆదాయం కూడా వారి ఉద్యోగులు పొందే రుణ మొత్తాన్ని నిర్ణయిస్తోంది. అంతిమంగా దరఖాస్తుదారు క్రెడిట్‌ స్కోరే ముఖ్యం.     – సాయి కుమార్‌ మామిడి, ప్రైవేట్‌ బ్యాంక్‌ సీనియర్‌ సేల్స్‌ అడ్వైజర్, హైదరాబాద్‌ 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)