Breaking News

‘నేను గోవధ చేశాను.. నన్ను జైలులో పెట్టండి’ అంటూ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి..

Published on Sun, 07/09/2023 - 09:08

ఏదో ఒక జంతువును చంపి, అనంతరం పోలీస్‌​ స్టేషన్‌కు వచ్చి నన్ను అరెస్టు చేసి, జైలుకు పంపించడంటూ వేడుకున్న వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూశారా?  ఇటువంటి ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో చోటుచేసుకుంది. గత కొంతకాలంగా పరారీలో ఉంటూ, గోవధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చాడు. తాను గోవధ చేశానని,ఇప్పుడు లొంగిపోవాలనుకుంటున్నానంటూ ఒక పోస్టర్‌ ‍ప్రదర్శిస్తూ, తనను అరెస్ట్‌చేసి, జైలుకు తరలించాలని పోలీసులను వేడుకున్నాడు. 

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోగల రూదౌలీ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. స్టేషన్‌లో శనివారం సమాధాన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చే ప్రజల సమస్యలను పోలీసులు తెలుసుకుంటున్నారు. ఇంతలో అక్బర్‌ అలీ అనే వ్యక్తి ఒక పోస్టర్‌ పట్టకుని, అక్కడి పోలీసు అధికారి దగ్గరకు వచ్చాడు.
 
అప్పుడు గోవధ చేసి.. ఇప్పుడు పశ్చాత్తాపం
అక్బర్‌ అలీ పోలీసులతో మాట్లాడుతూ ‘నేను గోవధ ఆరోపణలు ఎదుర్కొంటూ కొంతకాలంగా పరారీలో ఉన్నాను. ఈ కేసులో నా భార్య జైలులో ఉంది. మా సంసారం ముక్కలయ్యింది. నాకు పోలీసులపై నమ్మకముంది. అందుకే నేను లొంగిపోవాలని అనుకుంటున్నాను. మరోమారు నేను ఇలాంటి నేరాలకు పాల్పడను’అని చెప్పాడు. అక్బర్‌ మాటలు విన్నవారంతా తెగ ఆశ్చర్యపోయారు. అనంతరం పోలీసులు అతనిని స్టేషన్‌లో కూర్చోబెట్టారు.

2022 నాటి ఉదంతంలో..
రూధౌలీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎథర్‌ గ్రామంలో 2022లో కొంతమంది గోవులను హత్య చేశారు. ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్బర్‌ అలీ వీరిలో ఒకడు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు ఇప్పటికే జైలుకు తరలించారు. అయితే అక్బర్‌ అప్పటినుంచి పరారీలో ఉన్నాడు. 

జైలుకు వెళ్లిన భార్య
ఈ ఉదంతంలో అక్బర్‌ భార్య ఇంతకుమందే జైలుకు వెళ్లి, శిక్ష అనుభవిస్తోంది. ఇప్పుడు అక్బర్‌ పోలీసులకు లొంగిపోయాడు. పోలీసు అధికారి సత్యేంద్ర భూషన్‌  ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ గోవధ నిందితుడు.. సమాధాన దినోత్సవం నాడు లొంగిపోయాడన్నారు. అతనిని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి చర్యలు చేపడుతున్నామన్నారు. 
ఇది కూడా చదవండి: చివరికి.. తోపుడు బండిపై చిన్నారి మృతదేహం తరలింపు!

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు