Breaking News

కోవిడ్‌ కలకలం.. దేశవ్యాప్తంగా 1,000 దాటిన కేసులు

Published on Tue, 05/27/2025 - 07:04

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,000కి పైగా క్రియాశీలక కేసులున్నాయి. గత వారం రోజుల్లోనే 750 మంది కరోనా బారిన పడ్డట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీల్లో అత్యధికంగా కొత్త కేసులు పెరిగినట్టు తెలిపింది. కేంద్రం సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కేరళలో 335 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి.

అక్కడ యాక్టివ్‌ కేసుల సంఖ్య 430కి పెరిగింది. మహారాష్ట్రలో 153, ఢిల్లీలో 99 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 209కు, ఢిల్లీలో 104కు పెరిగింది. గుజరాత్‌లో 83 కేసులు, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్‌లో 15, పశ్చిమ బెంగాల్‌లో 12 కేసులు నమోదయ్యాయి. అయితే కేసుల పెరుగుదలతో భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది.

చాలా కేసుల్లో బాధితులు ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపింది. అధిక కేసుల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు రాపిడ్‌ రెస్పాన్స్‌ బృందంతో సమావేశం నిర్వహించింది. వ్యాధి తీవ్రత లేకున్నా అందరూ వ్యక్తిగత రక్షణ పాటించాలని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ సూచించారు. ఎలాంటి పరిస్థితికైనా ఢిల్లీ ఆసుపత్రులు పూర్తిగా సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి రేఖ గుప్తా తెలిపారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)