‘ఆ అభ్యంతరకర వీడియోలను తొలగించండి’: గూగుల్‌కు కోర్టు ఆదేశం

Published on Sun, 10/12/2025 - 08:25

లక్నో: ప్రముఖ రామకథ కథకుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత జగద్గురు రామభద్రాచార్యపై సోషల్ మీడియాలో కనిపిస్తున్న అభ్యంతరక వీడియోలను 48 గంటల్లోగా తొలగించాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ మెటా, గూగుల్‌లను ఆదేశించింది. జస్టిస్ శేఖర్ బీ సరాఫ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్.. శరద్ చంద్ర శ్రీవాస్తవ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

రామభద్రాచార్యపై అభ్యంతరకరంగా రూపొందించిన వీడియోల తొలగింపు ప్రక్రియను సులభతరం చేసేందుకు సోషల్ మీడియా కంపెనీలకు సంబంధిత యూఆర్‌ఎల్‌ లింక్‌లను అందించాలని కోర్టు పిటిషనర్లను ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణ నవంబర్ 11కి వాయిదా వేశారు. మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లోగల  దివ్యాంగ్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయిన జగద్గురు స్వామి రామభద్రాచార్యను అవమానపరుస్తూ శశాంక్ శేఖర్ అనే వ్యక్తి యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అభ్యంతరకర వీడియోలను పోస్ట్ చేస్తున్నారని పిటిషనర్‌ ఆరోపించారు.

రామభద్రాచార్య అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఆ వీడియోలు ఆన్‌లైన్‌లో ఉన్నాయని, వాటిని తొలగించడానికి సంబంధిత ప్లాట్‌ఫారమ్‌లు ఎటువంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించేందుకు నిబంధనలను రూపొందించి, కఠినంగా అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పిటిషన్ కోరింది. ఈ కంటెంట్ పరువు నష్టం కలిగించేలా ఉండటమే కాకుండా, రామభద్రాచార్య  కంటి చూపు కోల్పోవడాన్ని ఎగతాళి చేసేలా ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. రాష్ట్ర వికలాంగుల కమిషనర్ కార్యాలయం ఈ అంశాన్ని ఇప్పటికే పరిగణనలోకి తీసుకుని, శేఖర్‌కు నోటీసు జారీ చేసింది. అక్టోబర్ 18న అతను కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)