కుమారుడు లేని జీవితం ఎందుకని..

Published on Fri, 03/13/2026 - 13:39

కాసరగోడ్ (కేరళ):  ఏకైక కుమారుడు దూరం కావడంతో ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. రైలు ప్రమాదంలో కుమారుడు ప్రాణాలు కోల్పోయిన నాటి నుంచి వారు దుఃఖంలో మునిగిపోయారు. చివరకు ‘వాడు లేని లోకంలో మేము ఉండలేం’ అంటూ ఆ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కేరళలోని కాసరగోడ్ జిల్లా చెమ్నాడ్ పంచాయతీ పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

పొయినాచిలోని పరంబ ప్రాంతానికి చెందిన వేణుగోపాలన్ నాయర్ (50), ఆయన భార్య స్మిత (42) శుక్రవారం ఉదయం తమ నివాసంలో విగతజీవులుగా కనిపించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న మేల్పరంబ పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు.  ఏకైక కుమారుడు ఎం. శివానందన్ (19) మరణాన్ని జీర్ణించుకోలేక మనస్తాపంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న శివానందన్, గత ఏడాది డిసెంబర్ 29న జరిగిన ఒక దుర్ఘటనలో మరణించాడు. బేకల్ బీచ్ ఫెస్టివల్‌లో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరికి తన స్నేహితుడు అజేష్‌తో కలిసి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వేదికకు చేరుకోవడానికి సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న రైల్వే పట్టాలను దాటుతుండగా, ‘తిరునెల్వేలి జంక్షన్ - జామ్‌నగర్ ఎక్స్‌ప్రెస్’ వీరిని ఢీకొంది. ఈ ఘటనలో శివానందన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అజేష్ గాయాలతో బయటపడ్డాడు.

కొడుకు మరణం తర్వాత వేణుగోపాలన్, స్మిత దంపతులు తీవ్రమైన కుంగుబాటులోకి వెళ్లిపోయారని బంధువులు, పొరుగువారు కన్నీటి పర్యంతమవుతూ తెలిపారు. ‘వాడు లేకుండా మేము బతకలేము’ అని వారు తరచూ చెబుతుండేవారని, కుటుంబ సభ్యులు ఎంత ఓదార్చినా వారిలో మార్పు రాలేదని తెలిసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు జ్ఞాపకాలు వారిని ప్రతిక్షణం వెంటాడటంతో, మరణమే శరణ్యమని భావించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కాసరగోడ్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఇది కూడా చదవండి: ఎల్‌పీజీ కొరత.. మారిన ఆహార అలవాట్లు

#

Tags : 1

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)