Breaking News

‘పార్టీ కన్నా దేశమే ముఖ్యం’: ఎంపీ శశిథరూర్

Published on Sun, 07/20/2025 - 11:09

తిరువనంతపురం: ‘నేను భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు, మా పార్టీని ఇష్టపడే వారి కోసమే కాకుండా, భారతీయులందరి కోసం మాట్లాడతాను. ఎవరైనా సరే పార్టీ ప్రయోజనాల కన్నా దేశానికే ప్రాధాన్యత ఇవ్వాలని’ కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ పిలుపునిచ్చారు. ఇందుకు ఉదాహరణగా దివంగత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, ‘భారతదేశమే నశించిపోతే ఇక ఎవరు బతుకుతారు?’ అని  ప్రశ్నించారు. జాతీయ ఐక్యత అనేది రాజకీయ వైరాన్ని అధిగమించాలని థరూర్ పేర్కొన్నారు.
 

ఇటీవలి కాలంలో ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, కాంగ్రెస్‌ చేపడుతున్న  దౌత్యపరమైన ప్రచారం, జాతీయవాద వైఖరిపై వస్తున్న విమర్శల నేపధ్యంలో శశి థరూర్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. తిరువనంతపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎంపీ శశిథరూర్‌ మాట్లాడుతూ ‘దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు విభేదాలను పక్కన పెట్టి, భారతదేశం కోసం పనిచేయాలి. అప్పుడే  మనమంతా శాంతియుతంగా జీవించగలం. నా దృష్టిలో దేశానికే ‍తొలి ప్రాధాన్యత.. పార్టీలన్నీ దేశాన్ని మెరుగుపరచడానికి గల సాధనాలు. ఏ పార్టీకి చెందినవారైనా, ఆ పార్టీకి అనుగుణమైన మార్గంలో నడుచుకుంటూ మెరుగైన భారతదేశాన్ని రూపొందించేందుకు కృషిచేయాలి’ అని అన్నారు.  

శశిథరూర్‌ తనపై వచ్చిన విమర్శలను తిప్పికొడుతూ ఈ విధమైన వ్యాఖ్యానాలు చేశారు. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాక్‌ ఉగ్రవాద సంబంధాలు, భారత వైఖరిని అమెరికా వంటి దేశాలకు తెలియజేసేందుకు ఏర్పాటైన అఖిలపక్ష ప్రతినిధి బృందానికి శశిథరూర్‌ నాయకత్వం వహించారు. ఈ సమయంలో ఆయన ప్రసంగాలపై పలు విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పరోక్షంగా థరూర్‌ను లక్ష్యంగా చేసుకుని, కాంగ్రెస్ పార్టీ దేశానికే ప్రాధాన్యతనిస్తుందని, అయితే కొందరు ముందు ప్రధాని మోదీ, తరువాత దేశం అనే విధంగా వ్యాఖ్యానిస్తున్నారని ఆరోపించారు.

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)