Breaking News

జూబ్లీహిల్స్‌తో పాటు ఇక్కడా.. జోరుగా కౌంటింగ్‌

Published on Fri, 11/14/2025 - 08:37

న్యూఢిల్లీ: భారత రాజకీయాల్లో ఈరోజు (శుక్రవారం, నవంబర్‌ 14) ఒక ప్రత్యేకమైన దినం. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు  వెలువడనున్నాయి. దీనితోపాటు ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ఎనిమిది కీలక అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు కూడా నేడు వెల్లడికానున్నాయి. ఉప ఎన్నికలు జరిగిన ఈ ప్రాంతాల్లో ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమయ్యింది.

తెలంగాణ: జూబ్లీహిల్స్
తెలంగాణలోని జూబ్లీహిల్స్ సీటుకు ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్‌ నేత నవీన్ యాదవ్, బీఆర్‌ఎస్‌ మహిళా నేత సునీత మధ్య గట్టి పోటీ ఉండనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. లంకల దీపక్ రెడ్డిని బీజేపీ ఎన్నికల బరిలోకి దింపింది.

జమ్ముకశ్మీర్: బుడ్గామ్, నగ్రోటా
బుడ్గామ్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) అభ్యర్థి అఘా మెహమూద్‌తో పీడీపీ  నేత అగా సయ్యద్ ముంతాజీర్ తలపడ్డారు. ఒమర్ అబ్దుల్లా తన గండేర్‌బాల్ నియోజకవర్గాన్ని నిలబెట్టుకుని, బుడ్గామ్ స్థానాన్ని ఖాళీ చేయడంతో ఎన్నిక అనివార్యమయ్యింది. నగ్రోటాలో బీజేపీ ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా మరణంతో ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ ఎన్‌సీ నుంచి షమీమ్ బేగం, బీజేపీ నుంచి దేవయాని రాణి పోటీ చేస్తున్నారు.

రాజస్థాన్: అంట
రాజస్థాన్‌లోని అంట నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు చెందిన ప్రమోద్ జైన్ భయా,  బీజేపీకి చెందిన మోర్పాల్ సుమన్ మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. బీజేపీకి చెందిన కన్వర్ లాల్ మీనా తన స్థానాన్ని కోల్పోయిన  దరిమిలా ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

జార్ఖండ్: ఘట్‌శిల
జార్ఖండ్‌లోని ఘట్‌శిల ఉప ఎన్నిక  అందరి దృష్టిని ఆకర్షించింది.ఇక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ (బీజేపీ) కుమారుడు బాబులాల్ సోరెన్, మహాకూటమికి చెందిన సోమేష్ చంద్ర సోరెన్‌తో పోటీ పడుతున్నారు.

ఒడిశా: నువాపాడ
ఒడిశాలోని నువాపాడ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన జే ధోలాకియా, బీజేడీకి చెందిన స్నేహంగిని చురియా  కాంగ్రెస్‌కు చెందిన ఘసిరామ్ మాఝి మధ్య త్రిముఖ పోరు ఏర్పడింది.  స్థానిక కుల సమీకరణలు ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంటాయి.

పంజాబ్: తర్న్ తరన్
పంజాబ్‌లోని తర్న్ తరన్‌లో ఆప్ ఎమ్మెల్యే కాశ్మీర్ సింగ్ సోహల్ మృతితో ఉప ఎన్నిక జరిగింది. బీజేపీకి చెందిన హర్జీత్ సింగ్ సంధు, ఆప్‌కు చెందిన హర్మీత్ సింగ్ సంధు కాంగ్రెస్‌కు చెందిన కరణ్‌బీర్ సింగ్ బుర్జ్ ఇక్కడ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు.

మిజోరం: డంపా
షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేసిన మిజోరంలోని డంపా నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ నెలకొంది. బీజేపీ లాల్హ్మింగ్తంగా సైలోను, కాంగ్రెస్ జాన్ రోట్లువాంగ్లియానాను నామినేట్ చేసింది. ఎంఎన్ఎఫ్ ఆర్. లాల్తాంగ్లియానాను ప్రతిపాదించింది. జెడ్‌పీఎంకు చెందిన వాన్లాల్‌సైలోవా ఈ రేసులో చేరారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)