Breaking News

కరోనా అలర్ట్‌.. భారీగా పెరిగిన పాజిటివ్‌ కేసులు, మరణాలు

Published on Thu, 08/18/2022 - 10:51

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్‌ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. గత కొద్దిరోజులుగా స్థిరంగా ఉన్న కేసులు.. గురువారం ఒక్కసారిగా పెరిగాయి. అదే సమయంలో మరణాల సంఖ్య కూడా పెరగడం ఆందోళనకంగా మారింది. 

కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 12,608 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. అదే సమయంలో వైరస్‌ కారణంగా 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 16,251 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ​‍వ్యాప్తంగా ప్రస్తుతం 1,01,343 యాక్టివ్‌ కేసులు ఉ‍న్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. ఇక, రికవరీ రేటు 98.56 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.23 శాతానికి తగ్గాయి. డైలీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 4,42,98,864 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 4,36,70,315 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,27,206 మంది మృతి చెందారు. 

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఢిల్లీలో 1652 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అ‍య్యింది. ఇక ఆగస్టు 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఢిల్లీలో కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య దాదాపు 50 శాతం పెరిగింది. రెండు వారాల కింద 291 మంది ఆసుప్రతిలో చేరగా.. తాజాగా 591 మంది ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ తీసుకున్న వారి సంఖ్య.. 2,08,95,79,722కు చేరింది. బుధవారం ఒక్కరోజే.. 38,64,471 మందికి టీకాలు అందించారు.  

ఇది కూడా చదవండి: గ్రేట్‌ లవర్స్‌.. ఫేస్‌బుక్‌ లవ్‌ మ్యారేజ్‌ చివరకు ఇలా..

Videos

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

విరాట్ తోనే తలనొప్పి.. ఈ సాల కప్ కష్టమేనా?

మహానాడు వాయిదా వేస్తే కరోనాను అరికట్టినవారవుతారు

తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్ చల్

బాబు, పవన్ ను పక్కన పెట్టిన లోకేష్

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)