Breaking News

భద్రతా సిబ్బంది సమక్షంలోనే గ్యాంగ్‌స్టర్‌ టిల్లుపై కత్తితో..వీడియో వైరల్‌

Published on Sat, 05/06/2023 - 08:01

తీహార్‌ జైలులో గ్యాంగ్‌స్టర్‌ టిల్లు హత్యకు సంబంధించిన తాజా సీసీఫుటేజ్‌ వీడియో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో ఒక్కసారిగా తీహార్‌ జైలులోని అధికారులు, భద్రతా సిబ్బంది ప్రవర్తన విషయమై విమర్శలు వెల్లువెత్తాయి. ఢిల్లీలోని తీహార్‌ జైలులో జరిగిన గ్యాంగ్‌వార్‌లో టిల్లు తాజ్‌పురియా చనిపోయినట్లు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ సీసీఫుటేజ్‌ ప్రకారం..నిజానికి జైలులో భద్రతా సిబ్బంది సమక్షంలోనే గ్యాంగ్‌స్టర్‌ టిల్లు హత్యకు గురయ్యినట్లు తెలుస్తోంది.

ఆ వీడియోలో.. సుమారు 20 మంది ఖైదీలు టిల్లుపై దారుణంగా దాడిచేశారు. దీంతో భద్రతా సిబ్బంది అతని జైలు నుంచి తరలిస్తుండగా ప్రత్యర్థి గ్యాంగ్‌ మరోసారి దాడికి పాల్పడింది. వారంతా భద్రతా సిబ్బంది సమక్షంలో సుమారు 90 సార్లు కత్తితో దాడికి పాల్పడినట్లు కనిపిస్తోంది. భద్రతా సిబ్బంది ప్రేక్షక పాత్ర పోషించేదే తప్ప వారిని ఆపే యత్నం చేయలేదు. గ్యాంగ్‌స్టర్‌ టిల్లు శరీరీంపై సుమారు 100 గాయాలు గుర్తులు ఉన్నట్లు సమాచారం. దీంతో ఏడుగురు పోలీసులు సస్పెండ్‌ అయ్యారు.  ఆ తీహార్‌ జైలులో నియమించబడిన భద్రతా సిబ్బంది తమిళనాడు స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌కు చెందినవారు.

ఇదిలా ఉండగా, సెప్టెంబరు 2021లో రోహిణి కోర్టు కాంప్లెక్స్‌లోని కోర్టు గదిలో ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్ జితేందర్ మాన్ అలియాస్ గోగీని దారుణంగా హత్య చేసిన కేసులో మరణించిన తాజ్‌పురియా ప్రధాన నిందితుడు. ఐతే పోలీసులు తమ నాయకుడి మరణానికి ప్రతీకారంగా గోగీ గ్యాంగ్‌ సభ్యలు తాజ్‌పురియా హత్యకు పథకం పన్నారని ఆరోపణలు చేయడం గమనార్హం. కాగా, గత నెలలో, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు ప్రిన్స్ తెవాటియాను ప్రత్యర్థి ముఠా సభ్యులు తీహార్ జైలులో దాడి చేసి చంపిన ఘటన మరువక మునుపే మరో గ్యాంగ్‌స్టర్‌ హత్యకు గురవ్వడం చర్చనీయాంశంగా మారింది.  

వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

(చదవండి: మణిపూర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు)

Videos

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

Photos

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!