Breaking News

కాబోయే భర్తకు లవర్‌ ఉందని తెలిసి.. షాకిస్తున్న మరో ఘటన

Published on Sat, 09/27/2025 - 10:55

సంభాల్: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒక ఉపాధ్యాయురాలిపై యాసిడ్‌ దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో అరెస్ట్‌ చేశారు. ఈ దాడికి అతనిని ప్రేరేపించిన  జాహ్నవి అలియాస్ అర్చనను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కాబోయే భర్త ప్రియురాలిపై యాసిడ్‌ దాడి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడిని అమ్రోహా జిల్లాలోని తిగ్రి గ్రామానికి చెందిన నిషు తివారీ (30)గా గుర్తించారు. సెప్టెంబర్ 23న నఖాసా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో 22 ఏళ్ల టీచర్ పాఠశాల నుండి ఇంటికి తిరిగి వెళుతుండగా, నిందితుడు స్కూటర్‌పై వస్తూ, దేహ్పా గ్రామం సమీపంలో ఆమె ముఖంపై యాసిడ్ పోశాడని పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) కృష్ణ కుమార్ తెలిపారు. దాడిలో టీచర్‌కు 20 నుండి 30 శాతం మేరకు కాలిన గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే బాధితురాలిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి చేర్చారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు సాగించారు.

ఎన్‌కౌంటర్‌లో నిందితునికి గాయాలు
గురువారం రాత్రి కళ్యాణ్‌పూర్ గ్రామం సమీపంలో స్కూటర్‌పై వెళుతున్నప్పుడు నఖాసా పోలీసులు నిషును ఆపినప్పుడు, అతను అధికారులపై కాల్పులు జరిపాడు.  ఆత్మరక్షణ కోసం పోలీసులు తిరిగి కాల్పులు జరపడంతో అతని రెండు కాళ్లకు దెబ్బలు తగిలాయని పోలీసులు తెలిపారు. వెంటనే నిషును అరెస్టు చేసి, చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అతని వద్ద నుంచి ఒక పిస్టల్, రెండు కార్ట్రిడ్జ్‌లు, స్కూటర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అక్కాచెల్లెళ్ల పేరుతో నాటకమాడి..
పోలీసులు విచారణలో నిషు తివారి పలు ఆసక్తికర వివరాలు తెలిపాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఒక మహిళ తనను ప్రేమిస్తున్నట్లు చెప్పిందని, ఆమె డాక్టర్ అర్చనగా పరిచయం చేసుకున్నదని తెలిపాడు. డాక్టర్‌ అర్చన తనతో.. ఆమె సోదరి జాన్వికి ఒక సైనికుడితో నిశ్చితార్థం జరిగిందని, అయితే అతనికి అప్పటికే  ప్రియురాలు ఉండటంతో అతను వివాహాన్ని రద్దు చేసుకున్నాడని వివరించింది. అందుకే అతని ప్రియురాలైన టీచర్‌ను అడ్డుతొలగించాలనుకుంటున్నట్లు తెలిపింది. ఈ నేపధ్యంలోనే ఆ టీచర్‌పై యాసిడ్‌ దాడి చేయాలని తనకు చెప్పిందని నిషు తివారి పోలీసులకు తెలిపాడు. కాగా జాన్వి, డాక్టర్ అర్చన ఒకరేనని.. నిషు తివారీకి అబద్ధం చెప్పి, అతని చేత టీచర్‌పై యాసిడ్‌ దాడి చేయించిందని విచారణలో తేలింది. కేసు దర్యాప్తులో భాగంగా నిషు తివారీ,జాన్విలను జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు ఎస్పీ తెలిపారు.
 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)