మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!
Breaking News
అసదుద్దీన్ నినాదాలతో లోక్‌సభలో దుమారం
Published on Tue, 06/25/2024 - 15:38
సాక్షి,న్యూఢిల్లీ: లోక్‌సభలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ప్రమాణం దుమారం రేపింది. మంగళవారం(జూన్25) తెలంగాణ ఎంపీల ప్రమాణాల్లో భాగంగా అసదుద్దీన్ కూడా ప్రమాణం చేశారు.
ఈ ప్రమాణం ముగిసిన తర్వాత అసదుద్దీన్ చేసిన నినాదాలు వివాదాస్పదమయ్యాయి. జై తెంగాణ, జై భీమ్, జై పాలస్తీనా అని అసదుద్దీన్ నినదించారు. దీనిపై అధికారపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో స్పందించిన ప్రొటెం స్పీకర్ మెహతాబ్ అసదుద్దీన్ నినాదాలను రికార్డుల నుంచి తొలగిస్తామని ప్రకటించారు. స్పీకర్ ప్రకటన అనంతరం వివాదం సద్దుమణిగింది.
BREAKING : Huge uproar in the Parliament after Hyderabad MP Asaduddin Owaisi says “ Jai Palestine” at the end of his oath.
Your thoughts on this. pic.twitter.com/FQMEIeaFHX— Roshan Rai (@RoshanKrRaii) June 25, 2024
Tags : 1