Breaking News

మహాకుంభమేళాపై ఎంపీ జయాబచ్చన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

Published on Tue, 02/04/2025 - 07:09

న్యూఢిల్లీ: యూపీలోని ‍ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కుంభమేళా ఒక ప్రధానాంశంగా మారింది. దీనికితోడు కుంభమేళాలో పలు ఆసక్తికర అంశాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇదేవిధంగా ఈ మహాపర్వంపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మహాకుంభమేళాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మౌని అమావాస్యనాడు మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్(Samajwadi Party MP Jaya Bachchan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభ్‌లో నీరు అత్యంత కలుషితమైపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. తొక్కిసలాటలో మరణించినవారి మృతదేహాలను నదిలోకి విసిరేయడం వల్ల నీరు కలుషితమయ్యిందని, ఇదే నీరు అక్కడి ప్రజలకు చేరుతోందని, దీనిపై ఎవరూ ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదని, దేశంలోని సమస్యలపై ఎటువంటి శ్రద్ధ లేదని ఆమె ఆరోపించారు.

కుంభమేళాకు వచ్చే సామాన్యులకు ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు అందడం లేదని, వారి కోసం ఎటువంటి ఏర్పాట్లు  చేయలేదని ఆమె ఆరోపించారు. వీవీఐపీలు వచ్చినప్పుడు వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు కానీ, సామాన్యుల సౌకర్యాలను పట్టించుకోవడం లేదని అన్నారు. కోట్లాది మంది జనం కుంభమేళా(Kumbh Mela)కు వచ్చారంటూ అబద్ధాలు చెబుతున్నారని, అంత పెద్ద సంఖ్యలో జనం  ఎలా చేరుకోగలరని ఆమె ప్రశ్నించారు. ఇంతకీ మహా కుంభమేళాలో ఏం జరిగింది?  అనే విషయాన్ని ప్రపంచం ముందు  ఉంచాలని జయాబచ్చన్‌ డిమాండ్‌ చేశారు. ప్రజలకు నిజం చెప్పాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె అన్నారు.

మహా కుంభమేళా తొక్కిసలాట గురించి కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్(Congress MP Gaurav Gogoi) మాట్లాడుతూ కుంభమేళాలో కొందరు మరణించడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, దీనిపై ప్రత్యేక చర్చ జరగాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. న్యాయం కోసం ఎవరు ప్రశ్నిస్తున్నా దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం బుల్డోజర్‌ను నడుపుతోందన్నారు. కుంభమేళాలో  మృతుల సంఖ్యను ప్రభుత్వం  దాచిపెడుతోందన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని, తాము సభలో నోటీసు ఇచ్చినా, దానిని తిరస్కరించారన్నారు. భవిష్యత్తులో మహా కుంభమేళా అంశాన్ని లేవనెత్తుతామని గౌరవ్ గొగోయ్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Delhi Election: ఆ సీట్లలో ఆప్‌కు చుక్కలే..

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)