Breaking News

ఒడ్డుకు కొట్టుకొస్తున్న కంటెయినర్లు

Published on Tue, 05/27/2025 - 05:57

కొల్లం: కేరళ తీరానికి సమీపంలో మునిగిన లైబీరియా ఓడ నుంచి చమురు లీకేజీ కొనసాగుతోంది. ఓడలోని కంటెయినర్లు ఒడ్డుకు కొడ్డుకు వస్తున్నాయి. కొల్లం, అలప్పుఝలోని తీరం సమీపానికి తొమ్మిది కంటెయినర్లు అలల తాకిడితో కొట్టుకు వచ్చాయని సోమవారం అధికారులు తెలిపారు. ఆయిల్‌ లీకవుతున్నందున తీర ప్రాంత జిల్లాల్లో హైఅలెర్ట్‌ ప్రకటించారు. అధికారులతో సమావేశమైన సీఎం విజయన్‌ అక్కడి పరిస్థితులపై సమీక్ష జరిపారు. 

అప్రమత్తంగా ఉండాలని తీరప్రాంతాల ప్రజలను, మత్స్యకారులను ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) హెచ్చరించింది. ఆదివారం వేకువజామున సముద్రంలో మునిగిన ఈ ఓడలో 84.44 మెట్రిక్‌ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్‌ టన్నుల ఫర్నేస్‌ ఆయిల్‌ ఉన్నట్లు భారత తీర రక్షణ దళం(ఐసీజీ) తెలిపింది. కొన్ని కంటెయినర్లలో ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్‌ ఉందన్న వార్తలు అధికారులను కలవర పెడుతున్నాయి.

 ఇది లీకై సముద్ర జలాలతో కలిస్తే మండే స్వభావమున్న ఎసిటలీన్‌ వాయువుగా మారుతుందని చెబుతున్నారు. ‘ఓడ నుంచి చమురు లీకవుతోంది. ఇది గంటకు మూడు కిలోమీటర్ల మేర వ్యాపిస్తూ సముద్ర పర్యావరణానికి ప్రమాదకరంగా మారింది. ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం మధ్యలో 9 కంటెయినర్లు ఒడ్డుకు చేరాయి. మరో నాలుగు కంటెయినర్లు శక్తికులంగర హార్బర్‌ సమీపంలో, మూడు చావర సమీపంలో, ఒకటి చరియాజికల్‌ వద్ద, మరోటి త్రిక్కున్నపుఝ వద్ద కనిపించాయి.

 ఆయిల్‌ లీకేజీని అరికట్టేందుకు ఐసీజీ ప్రయత్నాలు చేపట్టింది. చమురు తెట్టు ఏర్పడకుండా డార్నియర్‌ విమానం సాయంతో రసాయనాలను వెదజల్లుతున్నారని సీఎంవో వివరించింది. ఈ ఘటన టయర్‌–2 కేటగిరీకి చెందినది కావడంతో ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు జాతీయ స్థాయిలో వనరులు, సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపింది. 

ఈ మొత్తం వ్యవహారాన్ని ఐసీజీ డైరెక్టర్‌ జనరల్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సీఎంవో పేర్కొంది. మునిగిన ఓడలోని మరికొన్ని కంటెయినర్లు అలప్పుజ, కొల్లం, ఎర్నాకులం, తిరువనంతపురం జిల్లాల దిశగా కొట్టుకు వచ్చే అవకాశముందని తెలిపింది. ఒడ్డుకు చేరిన, సముద్ర జలాల్లో కనిపించే కంటెయినర్లు, ఇతర అసాధారణ వస్తువులను తాకవద్దని, వాటి సమీపంలో గుమికూడవద్దని ప్రజలను, మత్స్యకారులను హెచ్చరించింది. 
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)