వినియోగదారుల ఫోరం అరెస్ట్‌ వారెంట్‌ ఇవ్వజాలదు

Published on Tue, 04/08/2025 - 05:54

కోల్‌కతా: వినియోగదారుల ఫోరంలకు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసే అధికారం లేదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. సాధారణ జైలులో నిర్బంధించాలంటూ ఉత్తర్వులు ఇచ్చేందుకు మాత్రమే అధికారముంటుందని పేర్కొంది. జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక ఇచ్చిన అరెస్ట్‌ వారెంట్‌ను సవాల్‌ చేస్తూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై ఈ మేరకు తీర్పు వెలువరించింది. 

తన ఆదేశాల అమలు కోసం సీపీసీ (క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌)కింద వారెంట్‌ ఇచ్చేందుకు అధికారం లేదని పేర్కొంది. ఇటువంటి ఆదేశాలు వినియోగదారుల రక్షణ చట్టంలో నిర్దేశించిన నిబంధనల పరిధిని అతిక్రమించడమే అవుతుందని తెలిపింది. ఓ వ్యక్తి ట్రాక్టర్‌ కొనుగోలు కోసం 2013లో ఓ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి రుణం తీసుకున్నాడు. అతడు రూ.25,716 బకాయి చెల్లించలేదంటూ ఫైనాన్స్‌ కంపెనీ ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుంది. 

దీంతో, బకాయిని పూర్తిగా చెల్లించిన ఆ వ్యక్తి ట్రాక్టర్‌ను, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ను తనకు తిరిగి ఇప్పించాలంటూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఫోరం ఆదేశాలను ఫైనాన్స్‌ కంపెనీ యజమాని పట్టించుకోలేదు. దీంతో, ఫోరం అతడి అరెస్ట్‌కు వారెంట్‌ జారీ చేసింది. ఫోరం అధికారాలను సవాల్‌ చేస్తూ అతడు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు పైవ్యాఖ్యలు చేసింది. ఫోరం వారెంట్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. 
 

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)