Breaking News

ప్రజల హక్కుల గురించీ ఆలోచించాలి

Published on Sat, 04/12/2025 - 04:57

న్యూఢిల్లీ: ప్రజలకుండే ప్రాథమిక హక్కుల గురించి కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఆలోచించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. నాగరిక్‌ అపూర్తి నిగమ్‌(ఎన్‌ఏఎన్‌) కుంభకోణం కేసును ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలంటూ ఈడీ వేసిన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 కింద రిట్‌ పిటిషన్‌ ఎలా వేస్తారంటూ జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ల ధర్మాసనం ఈడీ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజును ప్రశ్నించింది. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు భంగం వాటిల్లితే వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించి రక్షణ కోరేందుకు ఆర్టికల్‌ 32 వీలు కల్పిస్తుంది. 

ఇదే విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించగా అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు..ఈడీకి కూడా ప్రాథమిక హక్కులుంటాయంటూ బదులిచ్చారు. అలాగైతే, వ్యక్తులకు కూడా ప్రాథమిక హక్కులుంటాయనే విషయం ఈడీ ఆలోచించాలి కదా..అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషన్‌ ఉపసంహరించుకునే అనుమతి కోరడంతో ధర్మాసనం సమ్మతించింది. ఈడీ తన హక్కుల కోసం మరో కోర్టుకు వెళ్లొచ్చని సూచించింది. 

కుంభకోణం ఆరోపణలున్న మాజీ ఐఏఎస్‌ అనిల్‌ టుటేజా ముందస్తు బెయిల్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ఈడీ గతంలో ఆరోపణలు చేసింది. అంతేకాదు, ఈ కేసులో ఆరోపణలున్న ఉన్నత స్థాయి వ్యక్తులు కొందరు ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టులోని ఒక జడ్జీతో టచ్‌లో ఉంటూ న్యాయపరమైన వెసులుబాట్లు పొందారని కూడా పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసును ఢిల్లీకి బదిలీ చేయాలని, ముందస్తు బెయిల్‌ను కూడా రద్దు చేయాలని కోరింది.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)