Breaking News

నరకంలో అవిభాజ్య కవలలు సబా, ఫరా!

Published on Wed, 07/15/2026 - 09:11

పట్నా: బిహార్‌లోని పట్నాకు చెందిన 23 ఏళ్ల అవిభాజ్య కవల సోదరీమణులు సబా, ఫరా తీవ్ర ఆనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నారు. ‘క్రేనియోపేగస్’ అనే అరుదైన రుగ్మతతో తలలు కలిసి పుట్టిన ఈ సోదరీమణులు, గత మూడు నెలలుగా సరైన మందులు అందక నరకం అనుభవిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పట్నా సివిల్ సర్జన్ కార్యాలయం ద్వారా వీరికి నిత్యం ఆరు రకాల అత్యవసర మందులు అందాల్సి ఉండగా, ప్రస్తుతం అవి నిలిచిపోయాయి.

కుటుంబ సభ్యులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. మందులు అందకపోవడంతో సబా, ఫరాల చేతులు, కాళ్లలో వాపులు రావడమే కాకుండా, థైరాయిడ్ సమస్యలు పెరిగి, ఎముకల నొప్పితో వారు మరింత బలహీనంగా మారారు. 2012లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ఆరుగురు వైద్యుల బృందం క్రమం తప్పకుండా వీరిని పరీక్షించాల్సి ఉంది.

2020 జనవరి నుంచి ఒక్క వైద్యుడు కూడా వారిని పరీక్షించలేదు. తినడానికి, మాట్లాడటానికి కూడా వారు ఇబ్బంది పడుతున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వస్తుండగా, స్పందించిన సివిల్ సర్జన్ డాక్టర్ యోగేంద్ర ప్రసాద్, సమస్య తమ దృష్టికి వచ్చిందని, త్వరలోనే మందులు అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: రాహుల్, ప్రియాక ఎక్కడ? క్లిష్ట సమయంలో ఏమయ్యారు?
 

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)